Monkeypox Virus: మంకీపాక్స్ వైరస్ పేరుమార్చిన డబ్ల్యూహెచ్ఓ | WHO To Change Monkeypox Virus Name

Monkeypox Virus: మంకీపాక్స్ వైరస్ పేరుమార్చిన డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Monkeypox Virus: మంకీపాక్స్ వైరస్ పేరుమార్చిన డబ్ల్యూహెచ్ఓ

Monkeypox Virus: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. పేరును వైరస్ రావడానికి గల కారణాలతో పెట్టాలని నిర్ణయించారు.

“డబ్ల్యూహెచ్ఓ పార్టనర్లతో పాటు నిపుణులతో కలిసి మంకీపాక్స్ వైరస్ పేరు మార్చాలని అనుకుంటుంది. వీలైనంత త్వరగా కొత్త పేర్ల గురించి ప్రకటిస్తాము, ”అని బుధవారం మీడియా సమావేశంలో వివరించారు.

మంకీపాక్స్ కేసులపై WHO
మే 2022 ప్రారంభం నుండి, మంకీపాక్స్ కేసులు వ్యాధి స్థానికంగా లేని దేశాల నుంచి వచ్చింది. అనేక దేశాలలో నమోదవుతున్న కేసులలో వైరస్ స్థానికంగా పశ్చిమ లేదా మధ్య ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాలకు విస్తరించినట్లు రిపోర్టులలో పేర్కొన్నారు.

విస్తృతంగా భిన్నమైన భౌగోళిక ప్రాంతాలలో స్థానికేతర, స్థానిక దేశాలలో ఏకకాలంలో అనేక మంకీపాక్స్ కేసులు, సమూహాలు నమోదుకావడం ఇదే మొదటిసారి.

×