పెద్దలకు యువతతోనే కరోనా ముప్పు, వారిలోనే మరణాలు ఎక్కువ – WHO

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 07:34 AM IST
పెద్దలకు యువతతోనే కరోనా ముప్పు, వారిలోనే మరణాలు ఎక్కువ – WHO

యువతతో పెద్దలకు కరోనా ముప్పు పొంచి ఉందని, యువతరం కారణంగా..ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందని డబ్ల్యూ హెచ్ వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెల్లడించింది. కోవిడ్ – 19 సుడిగాలిలాంటిదని తెలిపారు.



దక్షిణ కొరియలో ఒకే రోజు…అత్యధికంగా 441 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయని, కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ లాంటి ఆంక్షలు విధించవచ్చని డబ్ల్యూ హెచ్ వో యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగ్ తెలిపారు.
https://10tv.in/accenture-to-lay-off-5-global-workforce-10000-in-india-at-risk-of-losing-jobs/
యువత నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తిని పెంచుతోందని, చాలా దేశాల్లో వారే వ్యాప్తిని నిర్దేశిస్తున్నారని ఇటీవలే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా.. ముసలివాళ్లకు, ఇతర జబ్బులతో బాధపడే వాళ్లకు మాత్రమే కాదు.. యువతకు కూడా ప్రాణాంతకమేనని వెల్లడించింది. సోషల్ డిస్టెన్సింగ్ కాకుండా..భౌతిక దూరం పాటించాల్సిన దానిపై ఫోకస్ పెట్టాలని సూచించింది.



కరోనా పుట్టినిల్లుగా పేర్కొనే చైనాలో వరుసగా గత 11 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. ఇతర దేశాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకగా, మొత్తం 324 మంది చికిత్స పొందుతున్నారు.