ఆమె ఎవరు.. దేశం మొత్తం మాట్లాడుకుంది

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చెర నుంచి సేఫ్‌గా ఇండియాకు తిరిగొచ్చారు. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి 9గంటల 20 నిమిషాలకు

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 11:06 AM IST
ఆమె ఎవరు.. దేశం మొత్తం మాట్లాడుకుంది

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చెర నుంచి సేఫ్‌గా ఇండియాకు తిరిగొచ్చారు. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి 9గంటల 20 నిమిషాలకు

భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చెర నుంచి సేఫ్‌గా ఇండియాకు తిరిగొచ్చారు. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి 9గంటల 20 నిమిషాలకు మాతృభూమిపై  అభినందన్ అడుగుపెట్టారు. వాగా బార్డర్ దగ్గర త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వీరుడికి ఘనస్వాగతం పలికారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అభిని.. భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్.

అభిని మనకు అప్పగించే సమయంలో ఆయన పక్కనే ఓ మహిళ ఉన్నారు. ఆమె అభి వెంటే నడిచారు. వింగ్ కమాండర్ పక్కనే ఉన్న ఆ మహిళ అందరి దృష్టిని ఆకర్షించారు. దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంది. అభినందన్ పక్కన ఉన్న ఆమె ఎవరు? ఆమె పేరు ఏంటి? ఆమెకి అభికి రిలేషన్ ఏంటి? అని అంతా ఆరా తీశారు. ఆ మహిళ గురించి తెలుసుకునేందుకు ఆరాటపడ్డారు. ఆ మహిళ అభినందన్ భార్య అని కొందరు, ఫ్యామిలీ మెంబర్  అని మరికొందరు, ఫ్రెండ్ అని ఇంకొందరు, కొలీగ్ అని కొందరు అనుకున్నారు.

నిజానికి ఆమె అభినందన్ భార్య కాదు ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్, కొలీగ్ అంతకన్నా కాదు. ఆమె పేరు డాక్టర్ ఫారిహ బుగ్తి. పాకిస్తాన్ విదేశీ కార్యాలయంలో భారత డైరెక్టర్. డాక్టర్ బుగ్తి Foreign Service Of Pakistan(FSP) అధికారి. ఆమె పదవి IFS(Indian Foreign Service) కు సమానం. బుగ్తి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి. విదేశాంగ కార్యాలయంలో భారత వ్యవహారాలను చూస్తారు. పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ కేసును విచారించే పాక్  అధికారుల్లో ఆమె కూడా ఒకరు. జాదవ్ భారత గూఢచారి అని ఆరోపిస్తూ పాకిస్తాన్ అరెస్ట్ చేసి జైల్లో బంధించిన సంగతి తెలిసిందే. 2018లో ఇస్లామాబాద్‌లో జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలిశారు.  ఆ సమయంలో వారి వెంట ఫారిహ బుగ్తి కూడా ఉన్నారు.