Male leaders pregnant : గర్భిణీ స్త్రీలలాగా తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు..కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

Male leaders pregnant : గర్భిణీ స్త్రీలలాగా తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు..కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

Japan Ruling Party Leaders  Pregnant Women Getups (1)

Japan ruling party leaders  pregnant women getups :  జపాన్ లో అధికార పార్టీకి చెందిన కొంతమంది అగ్రనాయకులు అచ్చంగా గర్భిణీ స్త్రీలులా తయారై తిరుగుతున్నారు. గర్భంతో ఉన్న స్త్రీ ఎలా ఉంటుందో అచ్చంగా అలా..గెటప్ వేసుకుని తిరుగుతున్నారు. దీంతో చూసేవారంతా షాక్ అవుతున్నారు. గందరగోళానికి గురయ్యారు. కానీ అసలు విషయం తెలిసి హ్యాట్సాఫ్ నాయకుల్లారా..అంటున్నారు. మరి వారు ఎందుకు గర్భిణీల గెటప్ లు వేసుకున్నారో తెలిస్తే మీరు కూడా హ్యాట్సాఫ్ చెబుతారు..

1

దేశానికి రాజు అయినా..లోకానికి దేవుడైనా అమ్మకు బిడ్డే. కానీ దేశం ఏదైనా ఈ సమాజంలో చాలామంది మగవారు ఓ అమ్మకు పుట్టామని ఇంగిత జ్ఞానం మరచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పరాయి ఆడదానిలో అమ్మను అక్కను చూడలేక కారు కూతలతో నోటి దురద తీర్చుకుంటారు. ఆడది లేకపోతే ఈ సృష్టే లేదని కనీసం మాట కూడా మరచిన కొంతమంది మగవారు దిగజారుడుతనంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో వింటున్నాం చూస్తున్నాం..అటువంటివారికి జపాన్ లో కొంతమంది పురుషులు చేసే పని తెలిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఏమాత్రం బుద్ధీ జ్ఞానం ఉన్నా..మనం కూడా మనుషులమేనా? అని ప్రశ్నించుకోవాల్సిందే.

23

అమ్మ, అక్క, భార్య, ఇలా మహిళ లేకుంటే ఈ ప్రపంచానికి మనుగడ లేదు. మరొకరికి జన్మనిచ్చే అరుదైన, అద్భుతమైన అవకాశాన్ని ప్రకృతి స్త్రీకి ఇచ్చింది. ఒక్కసారి ఊహించండి.. స్త్రీ లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. ఈ రోజు నువ్వు ఒక కొడుకుగా ఉన్నా, రేపు మరో బిడ్డకు జన్మనివ్వాలన్నా కావాల్సింది స్త్రీనే. స్త్రీ లేనిదే ఈ సృష్టే లేదు.

2

గర్భం ధరించిన సమయంలో మహిళలు ఎదుర్కునే సమస్యలు అన్నీ, ఇన్నీ కావు. ఈ సమస్యలు, బాధలు మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తాయి. అయితే జపాన్‌లో చాలా మంది మగ నాయకులు గర్భిణీ స్త్రీలలా తిరుగుతున్నారు. జపాన్‌ లో అధికార పార్టీకి చెందిన మసనోబు ఒగురా అనే జపాన్ నాయకుడితో పాము మరో ఇద్దరు అగ్ర నాయకులు గర్భిణీ స్త్రీలుగా కనిపించేలా జాకెట్లు ధరించి తిరగడం చాలామందిని గందరగోళానికి గురిచేసింది. వీళ్లు గర్భిణీల్లా కనిపించటానికి 7.5 కిలోల జాకెట్లు ధరించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. భారీ జాకెట్ ధరించడం వల్ల వారి లుక్ గర్భంతో మహిళల్లాగా కనిపిస్తున్నారు. ఈ ప్రెగ్నెంట్ లుక్‌లో ఉన్న ఈ నాయకుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

5

తకాకో సుజుకి అనే మహిళా నేత ఈ ప్రయోగానికి నాంది పలికారు. దీని ద్వారా, ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో మహిళలు ఎదుర్కునే సమస్యలు, సవాళ్లను పురుషులకు వివరించాలని కోరారు. వాస్తవానికి, దాదాపు అన్ని దేశాలల్లో వలెనే..టెక్నాలజీ అంటే జపాన్‌ అని చెప్పుకునే దేశం అయిన జపాన్ లో కూడా గర్భిణీ స్త్రీలకు కార్యాలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఉండవు.

14

దీంతో ప్రెగ్నెంట్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే తకాకో సుజుకి అనే మహిళా నేత ఇటువంటి విధానంతో గర్భం మోస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కునే ఇబ్బందులను ప్రపంచానికి ఎత్తిచూపాలని భావించటంతో అధికార పార్టీ అగ్ర పురుష నేతలు ఇలా గర్భిణీ స్త్రీల అవతారమెత్తారు.

123

ఈ వినూత్న ప్రయోగం వల్లనైనా..మన దేశ నాయకులు పిల్లల సంరక్షణ, ఉమెన్ కెరీర్స్, లింగ వివక్ష గురించి చర్చించగలిగే కొన్ని విధానాన్ని తీసుకువస్తారని నేను ఆశిస్తున్నానని తకాకో సుజుకి ఆశాభావం వ్యక్తంచేశారు. ఎందుకంటే చాలా దేశాలతో పాటు మహిళల విషయంలో మా దేశం కూడా వెనుకబడే ఉన్నామని తెలిపారామె.