బ్రెజిల్ లో పెద్ద సంఖ్యలో చిన్నారులు కరోనాతో ఎందుకు చనిపోతున్నారంటే?

బ్రెజిల్ లో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.

బ్రెజిల్ లో పెద్ద సంఖ్యలో చిన్నారులు కరోనాతో ఎందుకు చనిపోతున్నారంటే?

Why Are So Many Babies Dying Of Corona In Brazil

young children బ్రెజిల్ లో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయిన తర్వాత కూడా బ్రెజిల్ లో కోవిడ్ మరణాల సంఖ్య భారీ స్థాయిలో ఉందంటే అక్కడి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ఓ ఓన్జీవో వేసిన అంచ‌నాలు మాత్రం తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేలా ఉన్నాయి.బ్రెజిల్‌లో కరోనా వైరస్ తో సుమారు 1300 మంది ప‌సిపిల్ల‌లు చ‌నిపోయిన‌ట్లు భావిస్తున్నారు.

చిన్నారుల‌ను క‌రోనా ఏమీ చేయ‌ద‌ని తెలిసినా.. శిశు మ‌ర‌ణాలు ఊహించ‌ని రీతిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ.. బ్రెజిల్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రాసిన కథనం ప్ర‌కారం.. బ్రెజిల్ లో భారీ సంఖ్య‌లో కోవిడ్‌తో చిన్నారులు మృతిచెందారు. తొలుత చిన్నారుల్లో ఎటువంటి కోవిడ్ ల‌క్ష‌ణాలు లేకున్నా.. చ‌నిపోతున్న స‌మ‌యంలో కోవిడ్ ల‌క్ష‌ణాలు న‌మోదు అవుతున్న‌ట్లు గుర్తించారు. ల‌క్ష‌ణాలు అర్థం కాక‌పోవ‌డంతో వైద్యులు కూడా స‌రైన చికిత్స ఇవ్వ‌లేక‌పోతున్నారు. హార్ట్ రేట్‌, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గ‌డం వ‌ల్ల చిన్నారుల చ‌నిపోతున్న‌ట్లు అనుమానిస్తున్నారు.

వైట‌ల్ స్ట్రాట‌జీస్ అనే అంత‌ర్జాతీయ ఎన్జీవో సీనియ‌ర్ అడ్వైజ‌ర్ ఫాతిమా మారినో బ్రెజిల్ మ‌ర‌ణాల‌పై వివ‌ర‌ణ ఇస్తూ… చిన్నారుల‌కు క‌రోనా సోక‌దన్న వాద‌న అవాస్తవం అన్నారు. 2020 ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ ఏడాది మార్చి 15 వ‌ర‌కు 9 ఏళ్ల లోపు ఉన్న 852 మంది చిన్నారులు మృతిచెందారు. ఇదే స‌మ‌యంలో మ‌రో 518 మంది శిశువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య రెట్టింపుగా ఉంటుంద‌ని మారినో అంచ‌నా వేశారు. కోవిడ్ టెస్టింగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల సంఖ్య త‌క్కువ చెబుతున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. గుర్తు తెలియ‌ని శ్వాస‌కోస వ్యాధుల వ‌ల్ల ఏడాది కాలంలో తొమ్మిది ఏళ్ల లోపు ఉన్న 2060 మంది చిన్నారులు, 1302 మంది శిశువులు చ‌నిపోయిన‌ట్లు మారినో అంచ‌నా వేశారు.

ఎందుకిలా జరుగుతోంది

ప్రపంచంలో మూడవ అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశంగా బ్రెజిల్ ఉంది. కాగా, బ్రెజిల్ పిల్లలు మరియు చిన్నపిల్లలు కరోనాకి ప్రభావితమయ్యే అవకాశాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో సహా అన్ని వయసులవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని,మహమ్మారిని నియంత్రించినట్లయితేనే ఈ సినారియో(దృష్ట్యాంతాన్ని) తగ్గించవచ్చని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్స్ యొక్క సైంటిఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్యునైజేషన్స్ అధ్యక్షుడు అని రెనాటో చెప్పారు.

ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం బ్రెజిల్ యొక్క మొత్తం హెల్త్ కేర్ వ్యవస్థను ముంచెత్తింది. దేశవ్యాప్తంగా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతోంది,దేశవ్యాప్తంగా అనేక ఐసియులలో ఎక్కువ పడకలు లేవు, ప్రాథమిక ఔషధాల కొరత కూడా ఉంది. అయితే, కరోనా భీభత్సం కొనసాగుతున్నా దేశవ్యాప్త లాక్ డౌన్ విధించేందుకు మాత్రం బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో నిరాకరిస్తున్నారు. గతేడాది ఉత్తర బ్రెజిల్ లోని మనౌస్లో లో వెలుగుచూసిన పి 1 అనే చాలా డేంజర్ రకం కరోనా వైరస్ వల్లనే దేశంలో వైరస్ సంక్రమణ రేటు పెరిగిపోతుంది. గత నెలలో అయితే కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏ నెలలో లేనంతగా రెట్టింపుగా నమోదైనట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు.

మరోవైపు,టెస్టింగ్ కొరత కూడా భారీగా పిల్లలు కరోనా బారినపడుతుండటానికి దారి తీస్తున్న మరో సమస్య. పిల్లలకు కోవిడ్ నిర్ధారణ చాలా ఆలస్యంగా వస్తుందని, అప్పటికే వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిలో కోవిజ్ పాజిటివ్ గా తేలుతుందని ఫాతిమా మారినో చెప్పారు. కేసులను గుర్తించడంలో తమకు తీవ్రమైన సమస్య ఉందని తెలిపారు. సాధారణ జనాభాకు తగినంత టెస్ట్ లు లేవని, పిల్లలకు కూడా టెస్ట్ లు ఎక్కువగా చేయడం లేదని తెలిపారు. రోగ నిర్ధారణలో ఆలస్యం ఉన్నందున.. పిల్లల సంరక్షణలో ఆలస్యం ఉందని ఆమె చెప్పింది. ఇది తక్కువ టెస్టింగ్ సామర్థ్యం ఉన్నందున వల్లన మాత్రమే కాదని, కోవిడ్ -19 తో బాధపడుతున్న పిల్లల లక్షణాలను మిస్ చేయడం లేదా తప్పుగా నిర్ధారించడం సులభం కనుక, ఈ వ్యాధి చిన్నవారిలో భిన్నంగా కనిపిస్తుందని ఆమె చెప్పారు. రోగ నిర్ధారణలో ఆలస్యం ఉన్నందున.. పిల్లలు ఆసుపత్రికి వచ్చినప్పుడు వారు తీవ్రమైన స్థితిలో ఉన్నారని, పరిస్థితి క్లిష్టతరం అయ్యి చనిపోతున్నారని ఆమె చెప్పింది. ఇది పేదరికం మరియు హెల్త్ కేర్ అందుబాటుకి సంబంధించిన విషయమని కూడా ఆమె చెప్పారు.