COVID-19 జుట్టు ఊడిపోయేలా ఏం చేస్తుంది

COVID-19 జుట్టు ఊడిపోయేలా ఏం చేస్తుంది

COVID-19 పాజిటివ్ ఉన్న వారికి.. వచ్చి తగ్గిపోయినవారికి కొత్త అనుభవం ఏమంటే.. బాగా జుట్టు ఊడిపోవడమే. సెలబ్రిటీ వరల్డ్ తో పాటు, సైన్స్ వరల్డ్ రీసెంట్‌గా కొవిడ్-19 కారణంగా జట్టు ఊడిపోతుందంటూ స్పాట్ లైట్ లోకి తెచ్చింది. అద్దంలో చూసుకున్నప్పుడు, తలదువ్వుకుంటున్నప్పుడు ఈ విషయం మీరూ గమనించారా మరి..

అలీస్సా మిలానో అనే హీరోయిన్.. తనకు కొవిడ్ 19 కారణంగా హెయిర్ లాస్ అయిందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చసింది. ఇంకా ఓ సర్వేలో నటాలీ లాంబర్ట్ పీహెచ్‌డీ చెప్పారు. 1/4వ వంతు కరోనా పేషెంట్లలో ఈ లక్షణం కనిపించిందని వెల్లడించారు. ఇలా జుట్టు రాలిపోవడాన్ని టెలోజెన్ ఎఫ్యూవిమ్ అంటారు. కొవిడ్ 19 లేకపోయినా ఇదే లక్షణం కనిపించొచ్చు.

చాలా మంది పేషెంట్లలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భయాందోళనలకు గురవడంతో ఒత్తిడి పెరిగింది. నిజానికి వాళ్లలో ఎవరికీ వైరస్ సోకలేదు. ఒకసారిగా జుట్టు ఊడడం పెరిగిపోతే కరోనా పాజిటివ్ వచ్చిందని కాదు. ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారని.. ఉద్యోగం ఊడిపోవడం, ప్రేమించిన వారిని కోల్పోవడం, లైఫ్ స్టైల్ లో ప్రధాన మార్పులు, ఎక్సర్‌సైజుల్లో మార్పులు వల్ల కూడా జరగొచ్చు.