Jeff Bezos vs NASA : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నాసాపై ఎందుకు దావా వేశారంటే?

అమెరికా ప్రభుత్వంపై జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థ దావా వేసింది. ఎలన్ మాస్క్ (SpaceX)కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

Jeff Bezos vs NASA : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నాసాపై ఎందుకు దావా వేశారంటే?

Why Worlds Richest Man Jeff Bezos Wants To Sue Nasa

NASA vs Jeff Bezos : అమెరికా ప్రభుత్వంపై ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థ దావా వేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాతక్మ కాంట్రాక్టును ఎలన్ మాస్క్ స్పేస్ఎక్స్ (SpaceX)కు ఇవ్వడంపై బ్లూ ఆరిజన్ సంస్థ యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. నానా ప్రతిష్టాతక్మకమైన 2.9 బిలియన్ డాలర్ల మూన్ ల్యాండర్ ప్రోగామ్ ప్రాజెక్టును ఎలోన్ మాస్క్ SpaceXను ఎంచుకుంది. దాంతో ప్రైవేట్ అంతరిక్ష వ్యాపారవేత్తల మధ్య వివాదానికి దారితీసింది. అంతరిక్ష వాణిజ్యంలో బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థకు ఎలాన్ మాస్క్ స్పేస్‌ఎక్స్‌ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.

ఈ క్రమంలోనే నాసా ల్యాండర్ ప్రోగ్రామ్ ప్రాజెక్టును స్పేస్‌ఎక్స్‌కు ఇచ్చింది. అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. గత నెలలోనే గవర్నమెంట్ అకౌంటాబిలిటీ (GAO) నేషనల్ అరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ భాగస్వామ్యంతో సింగిల్ లూనర్ ల్యాండర్ ప్రొవైడర్ ఎంచుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు నాసా రెండు లూనార్ ల్యాండర్ ప్రోటోటైప్‌లను బ్లూ ఆరిజిన్స్‌తో ఎంచుకుంటుందని అనుకున్నారు. కానీ, అమెరికా కాంగ్రెస్ నుంచి నిధుల కోత కారణంగా బ్లూ ఆరిజిన్ కంటే స్పేస్‌ఎక్స్‌ను నాసా ఎంచుకుంది. బ్లూ ఆరిజన్‌ను తిరస్కరించింది. బ్లూ ఆరిజన్ నిరసన వ్యక్తంచేసినా కూడా GAO పట్టించుకోలేదు.

అమెరికా ఫెడరల్ కోర్టులో బ్లూ ఆరిజన్ సంస్థ దావా
దాంతో నాసాపై అమెరికా ఫెడరల్ కోర్టులో బ్లూ ఆరిజన్ సంస్థ దావా వేసింది. బ్లూ ఆరిజన్ దావాపై నాసా వచ్చే అక్టోబర్ 12న కోర్టులో తప్పక కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసు వివరాలను నాసా అధికారులు సమీక్షిస్తున్నారంటూ నివేదిక పేర్కొంది. బ్లూ ఆరిజిన్ దావాపై ఇప్పటివరకూ నాసా అధికారులు కూడా స్పందించలేదు. మరోవైపు Spacex కూడా దీనిపై స్పందించలేదు. ఓ నివేదిక ప్రకారం.. యుఎస్ కోర్ట్ ఆఫ్ ఫెడరల్ క్లెయిమ్‌లతో దాఖలైన ఈ వ్యాజ్యంతో స్పేస్‌ఎక్స్ నాసాల మధ్య ఒప్పందాన్ని నిలువరిస్తుంది. ఫలితంగా చంద్రునిపై వ్యోమగాములను 2024 నాటికి దింపేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Asteroid Bennu: భారీ ఆస్టరాయిడ్ ‘బెన్ను’ భూమిని ఢీకొట్టే ఛాన్స్.. నాసా హెచ్చరిక!

2024 ప్రారంభం నాటికి అంతరిక్ష నౌకను నిర్మించే కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కు నాసా గత ఏప్రిల్ నెలలోనే కట్టబెట్టింది. నాసా నిర్ణయంతో ప్రాథమిక సమస్యలు ఉన్నాయని, అధికార పరిధి కారణంగా GAO వాటిని పరిష్కరించలేకపోయిందని బ్లూ ఆరిజిన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ హ్యూమన్ లూనార్ ల్యాండింగ్ సిస్టమ్ (HLS) కాంట్రాక్ట్ కోసం నాసాకు 2 బిలియన్ డాలర్ల తగ్గింపు ఆఫర్ ఇచ్చారు. చంద్రుడి ల్యాండర్ కాంట్రాక్ట్ నాసా ఆర్టెమిస్ కార్యక్రమంలో ఒక భాగం. అంగారకుడిపై మొదటి మానవ మిషన్‌కు 2024 నాటికి వ్యోమగాములను తిరిగి చంద్రునిపైకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Space Debris Collision: అంతరిక్షంలో శిథిలాల ఘర్షణ.. దెబ్బతిన్న చైనా శాటిలైట్!