ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 11:48 AM IST
ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రానున్నారు. శుక్రవారం(మార్చి-1-2019) అభినందన్ భారత్‌లో అడుగపెట్టబోతున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలెట్ విక్రమ్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం తెలిపారు. అభినందన్‌ను రేపు(శుక్రవారం మార్చి 1) విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంటులో స్వయంగా ప్రకటించారు. శాంతి ప్రక్రియలో భాగంగా, చర్చలకు తొలి మెట్టుగా అభినందన్‌ను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీకున్నామని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
Read Also : విదేశీ ఎయిర్‌లైన్స్‌పై పాక్ బ్యాన్:దారి మళ్లిన USA,యూరప్ ఫ్లైట్స్

మేము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని ఇమ్రాన్ అన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని చేతకాని తనంగా చూడొద్దన్నారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించాడు. 5 నిమిషాల పుల్వామా ఘటన గురించి భారత్ అంతగా మాట్లాడుతోందన్న ఇమ్రాన్ ఖాన్… 19ఏళ్ల కశ్మీర్ యువకుడు మానవ బాంబుగా ఎందుకు మారాడో ఆలోచించడం లేదని అన్నారు.

అసలు ఓ యువకుడు ఇలా మానవబాంబుగా మారడానికి కారణాలు ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించాడు. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఆదిల్ అహ్మద్ దార్. అతడు కశ్మీర్‌కు చెందిన యువకుడు. టెర్రరిజం వైపు ఆకర్షితుడు అయ్యాడు. ఏడాది పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నాడు. సూసైడ్ బాంబర్‌గా మారి 40మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు.
Read Also : రికార్డుల వర్షం: ఒకే మ్యాచ్‌లో గేల్ సృష్టించిన అద్భుతాలు

ఫిబ్రవరి 27న బుధవారం భారత భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన ఆర్మీ ఆయుధాగారంపై దాడికి యత్నించాయి. వెంటనే రంగంలోకి దిగిన భారత వైమానిక దళానికి  చెందిన మిగ్ 21 యుద్ద విమానాలు.. పాక్ విమానాలను తరిమికొట్టాయి. మిగ్ 21 ఫైటర్ జెట్ పైలెట్ అభినందన్… భారత ఆయుధాగారాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేశారు.

పాక్ విమానాన్ని వెంబడించి కూల్చేశారు. ఈ క్రమంలో అదుపుతప్పిన మిగ్ 21 బైసన్ విమానం పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్థమాన్ ప్యారాచూట్ ద్వారా పాక్ భూభాగంలో దిగాడు. వెంటనే చుట్టుముట్టిన స్థానికులు అభినందన్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పాక్ ఆర్మీ.. ఘటనా స్థలానికి చేరుకుని అభినందన్‌ను అదుపులోకి తీసుకుంది.
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి