Jason-Laura Kenny : భార్యాభర్తలకు ఒకేసారి ఒలింపిక్ పతకాలు

ఒలింపిక్స్ కు అర్హత సాధించటమే గొప్పగా భావిస్తారు క్రీడాకారులు. అటువంటిది ఒకే కుటుంబంలో ఇద్దరూ అర్హత సాధిస్తే..ఆ ఇద్దరూ భార్యాభర్తలే అయితే..అర్హత సాధించటమే కాదు పతకాలు కూడా సాధించి అరుదైన ఘనత సాధించారు బ్రిటన్ కు చెందిన భార్యాభర్తలు. టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకాలు సాధించి ఇద్దరూ పక్క పక్కనే నిలబడి తమ పతకాలతో ఫోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైలర్ గా మారాయి.

Tokyo Olympics: Wife and husband win medals : ఒలింపిక్స్ కు అర్హత సాధించటమే గొప్పగా భావిస్తారు క్రీడాకారులు. అటువంటిది ఒకే కుటుంబంలో ఇద్దరూ అర్హత సాధిస్తే..ఆ ఇద్దరూ భార్యాభర్తలే అయితే..భలే భలేగా ఉంటుంది. అర్హత సాధించటమే కాదు పతకాలు కూడా సాధించి అరుదైన ఘనత సాధించారు బ్రిటన్ కు చెందిన భార్యాభర్తలు. టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకాలు సాధించి ఇద్దరూ పక్క పక్కనే నిలబడి తమ పతకాలతో ఫోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైలర్ గా మారాయి.

ఒలింపిక్స్ కు క్వాలిఫై అయితేనే చాలనుకునే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. దీని కోసం అహర్నిశలు కస్టపడతారు. అర్హత సాధించాక పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తారు. జీవితంలో ఒక్క ఒలింపిక్ పతకం సాధించినా ఎంతో గొప్ప అనుకుంటుంటారు. అటువంటిది బ్రిటన్ కు చెందిన ‘జాసన్ కెన్నీ, లౌరా’ అనే దంపతులు టోక్యో ఒలింపిక్స్ లో సైక్లింగ్ రేసుల్లో పతకాలు సాధించి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు.

జాసన్ కెన్నీ, లౌరా దంపతుల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇలా ఒలింపిక్స్ లో పతకాలు సాధించటం ఒక్క టోక్యో ఒలింపిక్స్ లోనే జరగలేదు. వీరికి ఇదే తొలిసారి కూడా కాదు. గతంలో కూడా కొన్ని ఒలింపిక్స్ లలో వీరిద్దరూ పాల్గొని పతకాలను సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఇద్దరూ గోల్డ్ మెడల్స్ కౌవసం చేసుకున్నారు. అలాగే 2016 రియో ఒలింపిక్స్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకుని ప్రపంచాన్ని తమవైపుతిప్పుకున్నారు. ఇప్పుడు టోక్యోలో కూడా అదే హవా కొనసాగించి దంపతులిద్దరూ రజత పతకాలను సాధించారు.

ఆరు సార్లు ఛాంపియన్ అయిన జాసన్ టోక్యోలో టీమ్ స్ప్రింట్‌లో మరో రజత పతకాన్ని సాధించగా..లారా ఇప్పటికే బ్రిటిష్ మహిళల విభాగంలో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా గుర్తింపు పొందారు. ఈక్రమంలో టోక్యో ఒలింపిక్స్ లో మరో రజత పతాకాన్ని సాధించారు. వీరి జంటను అంతా సైక్లింగ్ తారలు అని పిలుస్తుంటారు. ఒద్దరూ ఒలింపిక్స్ లో మొదటి రేసులోనే రజత పతకాలను సొంతం చేసుకోవటం విశేషం. లండన్, రియో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఘతన కూడా వీరి సొంతం.

ట్రెండింగ్ వార్తలు