దక్షిణ కొరియాకు కిమ్ సోదరి సీరియస్ వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : June 14, 2020 / 10:08 AM IST
దక్షిణ కొరియాకు కిమ్ సోదరి సీరియస్ వార్నింగ్

దక్షిణ కొరియా ఫై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్  సోదరి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సరిహద్దు మీదుగా ఉత్తర కొరియా అదినేత కిమ్ కు వ్యతిరేకంగా వస్తున్న కరపత్రాల విషయంలో దక్షిణ కొరియా తీరు మార్చుకోకపోతే సైనిక చర్యకు సిద్ధమని ఉత్తర కొరియా లో  అత్యంత  శక్తి వంతమైన మహిళగా పేరు పొందిన  కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. పట్టుదల, నియంత్రృత్వంలో అన్న కంటే రెండాకులు ఎక్కువ చదివిన కిమ్ యో జోంగ్…దక్షిణ కొరియాతో తెగదెంపులు చేసుకోవడానికి ఇదే సరైన టైమ్ అంటోంది. ఆ దేశంతో కాస్తో కూస్తో ఉన్న సంబంధాల్ని కూడా తెంచుకోవడానికి ఆమె రెడీ అవుతోంది. 

ప్రపంచమంతా కరోనా టెన్షన్‌లో ఉంటే…. తెలుగు రాష్ట్రాలంత విస్తీర్ణంలో ఉండే ఈ కొరియా దేశాల గోల ఏంటన్నది కొత్త చర్చ.  ఈమధ్య సరిహద్దుల్లో ఉత్తరకొరియాకి వ్యతిరేకంగా కొన్ని ప్లకార్డులు, జెండాల లాంటివి వెలిశాయి. వాటిని దక్షిణ కొరియాయే పెట్టిందన్నది ఉత్తర కొరియా ఆరోపణ. దక్షిణ కొరియా మాత్రం వాటిని ఉత్తర కొరియాయే పెట్టి… తమపై ఆరోపణలు చేస్తోందని అంటోంది.

 అంతేకాకుండా  దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా కొన్ని ఆందోళనలు జరుగుతుంటే… వాటిని అక్కడి పోలీసులు అణచివేయట్లేదని ఉత్తర కొరియా ఆగ్రహంతో రగిలిపోతుంది. ఈ సమయం లో కిమ్ సోదరి ఓ ప్రకటనలో…అధినేత పార్టీ ప్రభుత్వం నుంచి దాఖలుపడ్డ ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను శత్రుదేశం(దక్షిణ కొరియా)ఫై తెసుకోవాల్సిన తదుపరి  చర్యల్ని  అమలుచేయాలని సదరు విభాగాధిపతి ఆదేశాలు ఇచ్చాను.దేశ పౌరుల అసంతృప్తిని చల్లార్చేందుకు త్వరలోనే మా ఇనయం కూడా ఎదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఆ దిశగా నేను ఎటువంటి సంకేతం ఇచ్చినా ఇక తదుపరి నిర్ణయం ఆర్మీ చీఫ్ చేతిలోకి వెళ్ళిపోతుంది అని  కిమ్ యో జోంగ్ తెలిపారు  

ఈ రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు కానీ… కిమ్ యో జోంగ్… తన ఉనికిని చెప్పుకునేందుకే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కిమ్ అనారోగ్యం పాలవడంతో… ఇక ఉత్తరకొరియా పని అయిపోయినట్లే అని సౌత్ కొరియా అనుకుంటున్న సమయంలో… అంత సీన్ లేదు… నార్త్‌కి నేను ఉన్నాను అని చెప్పేందుకే కిమ్ యో జోంగ్ ఇలా రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. విశ్లేషకులు మాత్రం చెల్లెలితో పోల్చితే… కిమ్ చాలా బెటర్ అంటున్నారు. కిమ్ వెంటనే కయ్యానికి కాలు దువ్వడు అనీ… అదే చెల్లి మాత్రం వెంటనే యుద్ధానికి సిద్ధం అనే టైపు అని అంటున్నారు. గతంలో చాలా సందర్భాలలో ఆమె… అత్యంత కఠినంగా వ్యవహరించి… శత్రువులతో వామ్మో అనిపించింది.