Nepal Former PM : అధికారంలోకి వస్తే భారత్‌ నుంచి ఆ భూభాగాలను తీసుకుంటాం

నేపాల్ దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) చైర్మన్ కేపీ శర్మ ఓలీ​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో వచ్చే ఎన్నికల్లో తమ

Nepal Former PM : అధికారంలోకి వస్తే భారత్‌ నుంచి ఆ భూభాగాలను తీసుకుంటాం

Oli

K.P. Sharma Oli: నేపాల్ దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) చైర్మన్ కేపీ శర్మ ఓలీ​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. వివాదస్పద ప్రాంతాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​ భూభాగాలను​ భారత్‌ నుంచి తిరిగి తీసుకుంటామని ఓలీ శుక్రవారం అన్నారు. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుతామని అన్నారు.

చిట్వాన్ లో కమ్యూనిష్టు పార్టీ ఆఫ్​ నేపాల్​ 10వ సాధారణ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తాం తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోం. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ శక్తిగా సీపీఎన్​(యూఎంఎల్)అవతరిస్తుందన్నారు.

అయితే, గతంలో కూడా చైనా ప్రోద్భలంతో భారత్ లోని భూభాగాలైన లిపులేఖ్, నింపియాధుర, కాలాపానీ ప్రాంతాలపై ప్రధాని హోదాలో ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ భూభాగాలు నేపాల్ లో అంతర్భాగం అంటూ నానా రభస చేశారు కేపీ శర్మ ఓలి. భారత భూభాగాలను నేపాల్ దేశానివిగా చూపుతూ ఓ రాజకీయ మ్యాప్ ను కూడా గతేడాది ప్రధాని హోదాలో ఓలీ విడుదల చేశారు. తాజాగా మరోసారి ఈ భూభాగాలపై వ్యాఖ్యలు చేశారు.

ఇక,నేపాల్ ప్రధాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు నేపాల్ ప్రభుత్వం నిరాకరించింది. ఓలీ చేసిన వ్యాఖ్యలపై భారత్ లోని నేపాల్ రాయబార కార్యాలయం కూడా స్పందించేందుకు నిరాకరించింది. గతంలో రాముడి జన్మస్థలం అయోధ్య కాదంటూ.. నేపాల్ లోనే రాముడు జన్మించాడని వ్యాఖ్యలు చేశారు.

వివాదం ఏంటీ
కాలపానీకి పశ్చిమాన ఉన్న లిపులేఖ్​ పాస్​ భూభాగంపై భారత్​- నేపాల్​ మధ్య వివాదం నడుస్తోంది. రెండు దేశాలు కూడా కాలాపానీని తమ దేశంలో అంతర్భాగంగానే పరిగణిస్తున్నాయి. ఉత్తరాఖండ్​లోని పిథోర్​గఢ్​ జిల్లాలో కాలపాని ఉందని భారత్​ చెబుతుండగా.. నేపాల్ మాత్రం తమ పరిధిలోని ధార్చులా జిల్లాలో ఈ ప్రాంతం ఉందంటోంది. ఈ క్రమంలో కైలాష్ మానస సరోవర్ యాత్రను సులభతరం అయ్యేలా లిపులేఖ్​ పాస్​ను ఉత్తరాఖండ్​లోని ధార్చులాను కలుపుతూ భారత్​ నిర్మించిన రోడ్డు మార్గంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఈ క్రమంలో భారత్​కు చెందిన లింపియాధురా, కాలాపానీ లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా పరిగణిస్తూ నేపాల్ నూతన భౌగోళిక మ్యాప్​ను రూపొందించింది. ఈ మ్యాప్​ను ఆ దేశ క్యాబినెట్ ఆమోదించింది. నేపాల్ చర్యను భారత్ ఖండించింది. కృత్రిమంగా చేసిన మార్పులను ఆమోదించేది లేదని నేపాల్ ను భారత్ హెచ్చరించింది.

ALSO READ South Africa Returnees : దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా