గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టిన 36 అడుగుల ఎత్తున్న అల

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టిన 36 అడుగుల ఎత్తున్న అల

Windsurfer: ఎవరైనా అల వస్తే ఏం చేస్తారు.. తలదించుకుని తట్టుకుంటే ప్రాణాలతో సరదాగా బయటపడతారు. దురదృష్టవశాత్తు పట్టుకోల్పోతే మాత్రం అందులో కొట్టుకుని వెళ్లిపోతారు. కానీ, ఇక్కడ 36అడుగుల ఎత్తున్న అల ఓ యువతికి Guinness World Record తెచ్చిపెట్టింది. ఫ్రెంచ్ వైండ్‌సర్ఫర్ సారా హసెర్ న్యూ కెలాడోనియాలోని 2019 న్యూ ఇయర్ ఈవెనింగ్ రోజున ఈ ఘటన జరిగింది.

ఇంటర్నేషనల్ వైండ్‌సర్షింగ్ టూర్ వెరిఫై చేసి ‘ఉమెన్ బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ ఆల్ టైం’ కింద ఈ ఫీట్ కన్ఫామ్ చేసింది. ఇంటర్నేషనల్ వైండ్‌సర్షింగ్ టూర్ వైండ్ సర్ఫింగ్ గిన్నీస్ రికార్డులన్నింటీని మరోసారి చెక్ చేసింది. వాటన్నింటిలో కెల్లా హసర్ చేసిన ఫీట్ మాత్రమే హైలెట్ గా అనిపించడంతో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా ఆమె పేరు రికార్డులకెక్కించారు.

ఇది చాలా పెద్ద సర్టిఫికేషన్ ప్రోసెస్. మహిళలను ఇన్‌స్పైర్ చేస్తుందనే ఆశిస్తున్నామని.. వారి కలలను సాకారం చేసుకోవడానికి ఆ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరనే నమ్మకాన్ని సృష్టించిందని సర్ఫర్ మ్యాగజైన్ చెప్పింది.