Delta Mask : డేంజర్ డెల్టా.. ఎలాంటి మాస్కులు వాడితే అధిక రక్షణ లభిస్తుంది

కరోనా కొత్త వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా డెల్టా మారింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించింది. చాలా దేశాల్లో కరోనా కొత్త కేసులు

Delta Mask : డేంజర్ డెల్టా.. ఎలాంటి మాస్కులు వాడితే అధిక రక్షణ లభిస్తుంది

Delta Mask

Delta Mask : కరోనా కొత్త వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా డెల్టా మారింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. చాలా దేశాల్లో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరగ్గా.. అందులో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువ. డెల్టా వేరియంట్ జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే.. మాస్కులను అప్ గ్రేడ్ చేయడం. డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మాస్కులను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో ఎలాంటి మాస్కులు వాడాలి? ఎలాంటి మాస్కులతో అధిక రక్షణ లభిస్తుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. వారాంతంలో సగటు రోజువారీ కొత్త కొవిడ్ కేసులు రికార్డులను బద్దలు కొట్టాయి. మెజార్టీ వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం. కరోనా ఒరిజినల్ స్ట్రెయిన్ కన్నా డెల్టా వేరియంట్ మరింత ప్రమాదకరం. ఒరిజనల్ స్ట్రెయిన్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ బారిన పడ్డ వారిలో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

లూసియానాలో ప్రతి లక్ష మందిలో 126 మంది కరోనా బారిన పడ్డారు. ఇది జాతీయ సగటు కన్నా మూడు రెట్లు ఎక్కువ. మిసిసిపి, ఫ్లోరిడా లో ప్రతి లక్ష మందిలో సగటున 110, 100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త కేసులు పెరగడంతో చాలా సిటీస్ లో మళ్లీ మాస్కు మస్ట్ అనే రూల్ ని తీసుకొచ్చారు. దీంతో క్లాత్, సర్జికల్ మాస్కుల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. జూలై చివరి వారంలో మాస్కుల విక్రయాలు ఏకంగా 51శాతం పెరిగాయి.

మాస్కుల వినియోగం, విక్రయాలు గణనీయంగా పెరిగిన ఈ పరిస్థితుల్లో మాస్కుల నాణ్యత అనే అంశం తెరపైకి వచ్చింది. మాస్కుల నాణ్యత గురించి చర్చ నడుస్తోంది. నాణ్యమైన మాస్కులు కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యత కలిగిన మాస్కుల ద్వారా ఇన్ ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోని వారికి.

క్లాత్ మాస్కు కచ్చితంగా కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే సమర్థవంతమైన మాస్కు కల్పించినంత రక్షణ మాత్రం కల్పించలేదు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోని, హాని పొందడానికి అవకాశం ఉన్న వ్యక్తులకు.

Axios స్టడీ ప్రకారం.. ఎన్ 95, కెన్ 95 N95 అత్యంత ప్రభావవంతమైన ముఖ కవచాలు. ఆ తర్వాత సర్జికల్ మాస్కులు. ఆ తర్వాత డబుల్ లేయర్ క్లాత్ మాస్కులు ప్రభావవంతమైనవి. అయితే ఎన్95 మాస్కులు పిల్లలకు రోజువారీ వినియోగానికి అనుకూలం కాదు. పిల్లలు కచ్చితంగా రెండు లేయర్లు గల మాస్కు ధరించాలి అని నిపుణులు సూచించారు.