మిరాకిల్ :నెలరోజులల్లో రెండు ప్రసవాలు..ముగ్గురు పిల్లలు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 07:19 AM IST
మిరాకిల్ :నెలరోజులల్లో రెండు ప్రసవాలు..ముగ్గురు పిల్లలు

సాధారణంగా గర్భిణీ స్త్రీలు ప్రసవించినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లు పుడుతుంటారు. ఇటీవల ఓ మహిళకు ఏకంగా ఆరుగురు పిల్లలు పుట్టారని విన్నాం. అంతకంటే మరో విచిత్రం ఏటంటే ఏకంగా డాక్టర్లనే ఆశ్చర్యపరిచిన ఘటన జరింగింది ఓ గర్భిణీ విషయంలో. మహిళ గర్భం ధరించి డెలీవరీ అయిన తరువాత మరోసారి గర్భం ధరించి బిడ్డ పుట్టాలంటే తక్కువలో తక్కువగా లెక్కేసుకుంటే కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ప్రసవం జరిగిన కేవలం నెల రోజుల వ్యవధిలో మరో సారి ప్రసవం జరగింది ఓ మహిళకు. ఈ అరుదైన..అద్భుతమైన ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. 
 

జెస్సోరీ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ అనే మహిళ ఫిబ్రవరి 25న నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మరోసారి మార్చి 22న అరిఫాకు మరోసారి నొప్పులు రావడంతో ఆందోళన పడిన కుటుంబ సభ్యులు మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీంతో స్కానింగ్‌ చేసిన డాక్టర్స్ ఆమె కడుపులో మరో ఇద్దరు (కవలలు) బిడ్డలు ఉండడంతో షాక్‌కు గురయ్యారు. 

ఈ విషయాన్నే కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా షాక్ అయ్యారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. వారు కూడా ఒప్పుకోవటంతో ఆపరేషన్ చేసి ఇద్దరు బిడ్డలను బైటకు తీశారు. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 26 రోజులకు మరో ఇద్దరు కవలలు జన్మించారు. కాగా ‘అరిఫాకు రెండు గర్భాశయాలు ఉన్నాయనీ..ఇది సాధారణంగా చాలా అరుదు అనీ..తొలి కాన్పు సందర్భంగా వైద్యులు ఈ విషయాన్ని గమనించక పోవడంతో నెలరోజుల వ్యవధిలో ఆమె రెండుసార్లు ప్రసవించారు’ అని అరిఫాకు ఆపరేన్ చేసిన స్పెషలిస్ట్ డాక్టర్ షీలా తెలిపారు.