లక్కీ కంట్రీస్ : కరోనా మహమ్మారి సోకని దేశాలు ఇవే

  • Published By: nagamani ,Published On : July 21, 2020 / 12:49 PM IST
లక్కీ కంట్రీస్ : కరోనా మహమ్మారి సోకని దేశాలు ఇవే

కరోనా అనే మాట తారకమంత్రంలా అయిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే మాట. కానీ కరోనా అనే మాటే వినిపించని దేశాలు కూడా ఉన్నాయి. అబ్బా..ఆ దేశస్తులు ఎంత అదృష్టవంతులో కదా..అనిపిస్తోంది కదూ..నిజమే..అగ్రరాజ్యమా..అణగారిని రాజ్యమా అనేది తేడా లేకుండా కరోనా ప్రపంచంలోని చాలా దేశాల్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ప్రాణభయంతో ప్రజలు అల్లాడుతుంటే కరోనా మాత్రం వికటాట్టహాసం చేస్తోంది.
కరోనా కోరల్లో చిక్కుకున్న దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కేసులు, 6 లక్షలకు పైగా మరణాలతో ప్రపంచం తల్లడిల్లిపోతోంది.కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా లేదంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. ఆ దేశాల్లో నిజంగానే కరోనా లేదని అమెరికా కూడా అధికారికంగా గుర్తించింది. ఈ దేశాల్లో చాలావరకు పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలే కావడం విశేషం.

కరోనా సోకని ఆ అదృష్ట దేశాలు ఇవే…
వనెవాటు
మైక్రోనేషియా దీవుల సమాఖ్య
మార్షల్ దీవులు
పలావ్
తువాలు
ఉత్తర కొరియా
నౌరు
తుర్క్ మెనిస్థాన్
సమోవా
కిరిబాటి
టోంగా

పక్కనే ఉన్న చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు పూర్తిగా మూసేసి కరోనా తమ దేశంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడింది. తుర్క్ మెనిస్థాన్ విషయానికొస్తే కరోనా ప్రారంభంలోనే చైనాకు విమానాలు రద్దు చేసేసి ముందుస్తు జాగ్రత్తలతో భద్రంగా ఉంది. అన్ని దేశాలతో ఉన్న తమ సరిహద్దులు మూసేసి తన ప్రజలను రక్షించుకుంది తుర్క్ మెనిస్థాన్.

ఇక్క పసిఫిక్ ద్వీప దేశాల గురించి మరింత ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎదుకంటే విదేశాల నుంచి వచ్చేవారికి ఈ పసిఫిక్ ద్వీప దేశాల గురించి కఠిన నిబంధనలు పాటించాయి. అలా తమ దేశానికి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సిందేనని నిబంధనలు పెట్టాయి. ఆ తరువాత కూడా డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే పర్మిషన్ ఉండేలా కఠిన చర్యలు తీసుకున్నాయి. దీంతో పసిఫిక్ ద్వీప దేశాలు కరోనాకు ఆమడదూరంగా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఈ దేశాలు కరోనా మహమ్మారికి దూరంగా ఉన్నాయి. ఈ పసిఫిక్ ద్వీపదేశాల్లో జనాభా తక్కువగా ఉండడం కూడా ఆయా దేశాల ప్రభుత్వాలకు సేవలు అందించేందుకు ఈజీ అయ్యింది.