Ethiopia: నెత్తురోడిన ఇథియోపియా.. 230 మంది మృతి..

ఇథియోపియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది.. తాజాగా జరిగిన ఘర్షణలో సుమారు 230 మంది మరణించారు. వీరంతా అమ్హారా తెగకు చెందిన వారేనని తెలిసింది.

Ethiopia: నెత్తురోడిన ఇథియోపియా.. 230 మంది మృతి..

Ethiopia

Ethiopia: ఇథియోపియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది.. తాజాగా జరిగిన ఘర్షణలో సుమారు 230 మంది మరణించారు. వీరంతా అమ్హారా తెగకు చెందిన వారేనని తెలిసింది. ఆ దేశానికి చెందిన పలు వార్తా కథనాల ప్రకారం.. ఇథియోపియన్ తిరుగుబాటు బృందం ఆదివారం 230 మందికి పైగా అమ్హారా జాతి సభ్యులను ఊచకోత కోసింది. ఇథియోపియాలోని అతిపెద్ద ప్రాంతమైన ఒరోమియాలోని టోలే అనే గ్రామంపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ సభ్యులు దాడి చేయడంతో 230 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు అసోసియేటెడ్ మీడియాతో చెప్పారు.

National Herald Case: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు

ఒరోమో లిబరేషన్ ఆర్మీ(OLA) అని పిలువబడే తిరుగుబాటు సంస్థ. ఇథియోపియన్ ప్రభుత్వం OLAను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవల కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. తాజాగా జరిగిన ఘటన అతిపెద్దదిగా స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. శనివారం జరిగిన దాడి నుంచి తృటిలో తప్పించుకున్న గింబీ కౌంటికీ చెందిన అబ్దుల్ సీద్ తాహీర్ మాట్లాడుతూ.. మేం మా జీవిత కాలంలో చూసిన పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని అన్నాడు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మమ్మల్ని తరలించాలని అమ్హారా తెగ ప్రజలు కోరుతున్నారని షాంబెల్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇదిలాఉంటే 2020 నవంబర్ నుండి ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఉత్తర ప్రాంతంలో తిగ్రేలో ప్రారంభమైన తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పటి నుండి దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఘోరమైన జాతి హింసలో ఈ దాడి ఒకటి అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే తాజా మారణ హోమానికి ఒరేమో లిబరేషన్ ఆర్మీనే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఆరోపణలను ఒరేమో లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ తీవ్రంగా ఖండించారు.