పార్లమెంటులో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం..సారీ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

పార్లమెంటులో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం..సారీ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

Australian PM Apologises  Woman Raped In Parliament :  చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణంపై సాక్షాత్తూ ప్రధాని పార్లమెంట్ లోనే క్షమాపణ చెప్పారు. ఈ దారుణానికి బలైన సదరు మహిళా ఉద్యోగి కన్నీరు పెడుతూ అధికారులకు చెప్పినా పట్టించుకోని దారుణాతి దారుణమైన ఘటన సాక్షాత్తూ..ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరిగింది…!! అత్యాచారానికి గురైన బాధిత మహిళ ఏదో సాధారణమైన ఉద్యోగిని కాదు. సాక్షాత్తూ..ఆస్ట్రేలియా రక్షణ మంత్రి  లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని కావటం గమనించాల్సిన విషయం.

ఆ ఉద్యోగినిపై ఆమెతో పాటుపనిచేసే సహోద్యోగి అత్యాచారం చేయటం మరో విశేషం. ఈ విషయాన్ని బాధితురాలే స్వయంగా ఆరోపించించారు. 2019లో జరిగిన ఈ లైంగిక వేధింపుల ఘటనను ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తనపై లైంగిక దాడి జరిగిన సమయంలో స్థానిక మీడియా, పోలీసులతో తన గోడు చెప్పుకున్నప్పటికీ తనను ఎవ్వరూ పట్టించుకోలేదనీ ఆమెవాపోయారు.

తనపై జరిగిన ఈ అత్యాచారం గురించి పై అధికారుకు చెప్పినా వారు కూడా సరిగా స్పందించలేదని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రక్షణ మంత్రి కార్యాలయంలో ఓ ఉద్యోగినికే రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇంత ఘోరం జరిగినా నేను చెప్పినా..ఏ ఒక్కరూ తన గోడు పట్టించుకోలేదని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారామె.

అయితే, అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన తాను భవిష్యత్‌ మీద ఉన్న భయంతో నోరు విప్పకుండా ఉండిపోవాల్సి వచ్చిందనీ..పై అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోకపోవటంతో తాను అలా నోరు మూసుకుని ఉండిపోవాల్సి వచ్చిందని వాపోయిందామె. కాగా..ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదని దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆస్టేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బాధిత మహిళకు క్షమాపణలు కోరారు. ఘటన జరిగిన విషయం ఆలస్యంగా తెలిసినా బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు.

పని ప్రదేశాలలో మహిళలు ఎలాంటి వివక్ష ఎదుర్కోకూడదని..ఇటువంటివాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఫిర్యాదు అందినవెంటనే స్పందిచాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఆస్ట్రేలియాలో పనిప్రదేశాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా స్టేఫానీ ఫాస్టర్‌ అనే అధికారిని నియమించారు ప్రధాని స్కాట్‌ మోరిసన్‌.