Viral Video: రోడ్డుపై పెన్నులు అమ్ముతున్న బాలిక ముఖంలో వెలుగులు నింపిన మహిళ

Viral Video: రోడ్డుపై పెన్నులు అమ్ముతున్న బాలిక ముఖంలో వెలుగులు నింపిన మహిళ

Viral Video

Viral Video: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇక అమ్మాయిలపై విధిస్తున్న ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. చదువుకోవాల్సిన చాలా మంది అమ్మాయిలు ఇంటి పనులు, వంట పనులకే పరిమితం అవుతున్నారు. ఇక పేదల పరిస్థితి మరింత దిగజారిపోయింది. కుటుంబ పోషణ కోసం బాలికలు కూడా కష్టపడాల్సి వచ్చింది.

కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై బొమ్మలు, పెన్నులు అమ్ముకుంటూ కనపడుతున్నారు చిన్నారులు. అటువంటి ఓ బాలికకు ఓ మహిళ సాయం చేసి, ఆ చిన్నారి ముఖంలో నవ్వుల వెలుగులు నింపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ బాలికపై మహిళ చూపిన దయ గొప్పది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అఫ్గాన్ లోని కాబూల్ కు చెందిన జైనాబ్ అనే ఓ బాలిక రోడ్డుపై పెన్నులు అమ్ముకుంటోంది. ఓ కారు వద్దకు వెళ్లి పెన్ను కొంటారా? అని ఆ బాలిక అడిగింది. దీంతో కారులోని మహిళ ఒక్కో పెన్ను ఎంత అని అడిగింది. దీంతో ఆ బాలిక రూ.12 అని చెప్పింది. ఒకవేళ నేను పెన్నులు అన్నీ కొంటే? అని ఆ బాలికను మహిళ ప్రశ్నించింది.

దీంతో ఆ బాలిక నవ్వింది. ఆ తర్వాత ఆ బాలికకు మహిళ కొంత డబ్బు ఇచ్చింది. చాలా ఎక్కువ ఇచ్చారని ఆ బాలిక చెప్పింది. అనంతరం ఆ బాలిక మరింత డబ్బు ఇచ్చింది. దీంతో ఆ బాలిక ముఖం వెలిగిపోయింది. ఆ డబ్బంతా తన తల్లికి ఇవ్వడానికి ఆ బాలిక పరుగులు తీసింది.

Daggubati Venkateswara Rao: ఇక రాజకీయాలకు గుడ్‌బై.. మాజీ మంత్రి దగ్గుబాటి సంచలన ప్రకటన..