US : చిన్నారుల మృతదేహాలతో కారులో నెలల ప్రయాణం

చిన్నారుల మృతదేహాలతో కారులో ఓ మహిళ నెలల తరబడి ప్రయాణం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. ఓ మృతదేహాన్ని సూట్ కేస్, మరో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ప్రయాణం చేసింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇది బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

US : చిన్నారుల మృతదేహాలతో కారులో నెలల ప్రయాణం

Us Police

Dead Children : చిన్నారుల మృతదేహాలతో కారులో ఓ మహిళ నెలల తరబడి ప్రయాణం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. ఓ మృతదేహాన్ని సూట్ కేస్, మరో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ప్రయాణం చేసింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇది బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితురాలిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తూర్పుతీర నగరం బాల్టిమోర్ చెందిన నికోల్ జాన్సన్ (33)..తన ఏడేళ్ల మేనకొడలిని గత సంవత్సరం చంపేసి సూట్ కేసులో పెట్టి ట్రంకు పెట్టెలో దాచిపెట్టింది. దీనిని కారులో పెట్టేసింది.

Read More : Pune : ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా ఐపీఎస్ ఆడియో క్లిప్ వైరల్

అనంతరం సంవత్సరం తర్వాత..ఐదేళ్ల మేనల్లుడును దారుణంగా చంపేసింది. ఈ డెడ్ బాడీని..కుళ్లిపోయిన మేనకోడలి మృతదేహాం వద్ద మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచీలో పెట్టేసింది. ఇద్దరి శవాలను కారులో ఉంచి..సిటీలో తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో..పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరియైన పత్రాలు లేకపోవడంతో కారును స్వాధీనం చేసుకోవాలని భావించారు. తర్వాత కారును తనిఖీ చేయగా మృతదేహాలు బయటపడ్డాయి. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే..చిన్నారులను ఎందుకు చంపిందనే విషయం తెలియడం లేదు.