Italy Woman Died : 1991లో రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన మహిళ.. 31 ఏళ్ల తర్వాత కన్నుమూత

1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు.

Italy Woman Died : 1991లో రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన మహిళ.. 31 ఏళ్ల తర్వాత కన్నుమూత

Italy Woman Died

woman in coma died : ఇటలీలో విషాధకరమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన ఏడాదిన్నర తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన మహిళ 31 ఏళ్ల తర్వాత మరణించారు. ఇంతకాలం ఆమె జీవిస్తుందనే విశ్వాసంతో ఉన్న భర్త ఆశ నిరాశగా మిగిలింది. వెనెటోకు చెందిన మిరియం విసింటిన్ కు ఒక డిస్కోలో ఏంజెలో ఫరినాతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు.

1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు. కాగా, మిరియం విసింటిన్ బతికే అవకాశాలు లేవని ప్రమాదం జరిగిన రోజే 33 ఏళ్ల భర్త ఏంజెలో ఫరీనాకు డాక్టర్లు తెలిపారు. అయితే తన భార్య బతుకుతుందని అతడు చాలా విశ్వాసంతో ఉన్నారు. భార్య కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లి రోజు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు.

Man Consumed Only Cold Drinks : అతను ఏమీ తినడు.. 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ లీటర్లు లీటర్లు తాగేస్తున్నాడు.. కారణం ఏంటంటే?

కోమాలో ఉన్న భార్యను కేర్ సెంటర్ లో ఉంచి ఏళ్ల తరబడి వైద్యం అందిస్తున్నారు. ప్రతి రోజూ ఆఫీస్ లంచ్ సమయంలో అక్కడుకు వెళ్లి భార్యను చూసేవారు. కొన్నిసార్లు సాయంత్రం వేళల్లో ఆమె దగ్గరు ఉండేవారు. మరోవైపు 31 ఏళ్లుగా కోమాలో ఉన్న మిరియం విసింటిన్ ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు 2 నెలల క్రితం డాక్టర్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం శాన్ బాస్సియానోలోని హాస్పిటల్ కు ఆమెను తరలించారు.

అయితే, మే10న ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న భర్త ఏంజెలో ఫరీనా తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆఖరికి ఆమెకు శాంతి చేకూరిందని, ఆమె స్వర్గానికి చేరడంపై తనకు సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాము ఇద్దరం కలిసి ఎన్నో చేయాలని కలలు కన్నట్లు ఏంజెలో ఫరీనా తెలిపారు.

Madhya Pradesh: బస్సు-ట్రాలీ ఢీ… నలుగురి మృతి, 15 మందికి తీవ్రగాయాలు

అయితే పెళ్లైన ఏడాదిన్నర తర్వాత యువ దంపతులమై తమ పట్ల విధి క్రూరంగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు ఇలా జరిగివుండాల్సికాదని శనివారం ఆమె అంత్యక్రియల సమయంలో భర్త కన్నీటి పర్యంతమయ్యారు.