six doses of vaccine : ఒకే మహిళకు 6 డోసుల క‌రోనా టీకా వేసేసిన హెల్త్ వ‌ర్క‌ర్ : బాటిల్ మొత్తం ఎక్కించేసింది..!!

six doses of vaccine : ఒకే మహిళకు 6 డోసుల క‌రోనా టీకా వేసేసిన హెల్త్ వ‌ర్క‌ర్ : బాటిల్ మొత్తం ఎక్కించేసింది..!!

Six Doses Of Vaccine

woman given six doses of corona vaccine shot : కరోనా టీకా వేయించుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు విడతలుగా రెండు డోసులుగా చేస్తారు. కానీ ఓ హెల్త్ వర్కర్ చేసిన ఘన కార్యం గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. కరోనా టీకా వేయించుకోవటానికి వచ్చిన ఓ మహిళకు హెల్త్ వర్కర్ ఏకంగా బాటిల్ లో ఉన్న వ్యాక్సిన్ మొత్తం ఎక్కించేసింది.అంటే ఆరు డోసుల వ్యాక్సిన్ ను ఒకేసారి ఇంజెక్షన్ చేసేసింది. మొత్తం సీసాలోని మొత్తం వ్యాక్సిన్ ఎక్కించేశామని తెలుసుకున్న హెల్త్ సిబ్బంది సదరు మహిళను హడావిడిగా హాస్పిటల్ కు తరలించేసిన ఘటన ఇటలీలోని టుస్కానీలో జరిగింది.

క‌రోనా టీకా కోసం ఓ మ‌హిళ‌ల ద‌వాఖాన‌కు వెళ్లింది. హాస్పిట‌ల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్‌ను ఒకే సారి ఇచ్చేశారు. అనంత‌రం తేరుకుని ఆమెను హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేసుకున్నారు. రోజు మొత్తం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచారు. ఎలాంటి అపాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఆమెను డిశ్చార్జీ చేశారు. ఈ ఘ‌ట‌న ఇంట‌లీలోని టుస్కానీలో జ‌రిగింది.

23 ఏళ్ల మ‌హిళ‌ల క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి గత ఆదివారం (మే9,2021) టుస్క‌నీలోని ఓ హాస్పిటల్ కు వెళ్లింది. తన వంతు వచ్చాక ఇంజక్షన్ వేసే హెల్త్ వర్కర్ దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఈ క్రమంలో హాస్పిట‌ల్‌లోని హెల్త్ వ‌ర్క‌ర్ ఆమెకు ఫైజ‌ర్ వ్యాక్సిన్ బాటిల్ లోని మొత్తం మందును ఆమెకు ఇంజెక్ట్ చేసేసింది. ఫైజ‌ర్‌కు చెందిన ఒక్క వ‌య‌ల్‌లో ఆరు డోసుల టీకా ఉంటుంది. ఆ తరువాత కాసేపటికి ఆ హెల్త్ వర్కర్కు అసలు విషయం గుర్తించింది. హడలెత్తిపోయింది. ఆమెకు ఏమవుతుందోనని కంగారుపడిపోయింది. అదే విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది సదరు మ‌హిళ‌ను ఇన్ పేషెంట్ గా అడ్మిట్ చేసుకున్నారు.

అలా ఆమెను 24 గంట‌ల‌పాటు డాక్టర్లు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచుకున్నారు. కానీ ఆమె అదృష్టమో ఏమో..మరేదో గానీ ఆమెకు ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రాలేదు. దీంతో ఆమెను మరునాడు అంే సోమ‌వారం ఉద‌యం డిశ్చార్జీ చేశారు. కానీ హాస్పిటల్ లో ఫిజిష‌న్ ఆమెను కొన్ని రోజుల పాటు ప‌ర్య‌వేక్షిస్తామని ఎటువంటి తేడాలు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని వెంటనే హాస్పిటల్ కు రావాలని తెలిపారు. ఇది పొరపాటున జరిగిందనీ..కావాలని చేయాలేని కానీ ఆమెకు ఏమీ కాకపోవటం మంచిదేనని..ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని సంబంధితన అధికారులు తెలిపారు.