Chewing Gum.. Bubbles Business : చూయింగ్ గమ్ బుడగలు ఊది భారీగా సంపాదిస్తున్న మహిళ..

గమ్ తో బుడగలు ఊది..బిజినెస్ చేస్తోంది ఓమహిళ. ఆ బుడగలను ఆన్‌లైన్‌లో అమ్ముతూ భారీగా సంపాదిస్తోంది.

Chewing Gum.. Bubbles Business : చూయింగ్ గమ్ బుడగలు ఊది భారీగా సంపాదిస్తున్న మహిళ..

Woman Over Rs 67k Chewing Gum, Blowing Bubbles

Woman Over Rs 67K Chewing Gum, Blowing Bubbles : చేసేది చిన్నపని..కానీ సంపాదించేది లక్షలు. ఆ పనిలో క్రియేటివిటీ లేకపోయినా కొన్ని ఇట్టే క్లిక్ అయిపోతాయి. లక్షల సంపాదన తెచ్చిపెడతాయి.
యూకేకు చెందిన 20 ఏళ్ల జార్జ్ వుడ్‌విల్లే..మురికి కాళ్ల ఫోటోలతో కోట్లు సంపాదిస్తున్నాడు. అతడి మురికి కాళ్ల ఫొటోలను కొనేందుకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఫాలోవర్లు ఎగబడుతున్నారు. యూట్యూబర్,ఇన్‌స్టాగ్రామ్ మోడల్ బెల్లె డెల్ఫిన్ తను స్నానం చేసిన నీటిని అమ్మి డబ్బులు సంపాదిస్తోంది. ఇలా అమ్మకానికి ఏదీ కాదు అనర్హం అన్నట్లుగా తయారైంది. డబ్బుబుల సంపాదించే తెలివి ఉండాలే గానీ ఎలాగైనా సంపాదించొచ్చు అంటున్నారు ఎంతోమంది. చేసే పని సాధారణమైదే అయినా డబ్బలు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.అటువంటిదో ఓ మహిళ ఈజీగా లక్షలు సంపాదిస్తోంది. ఆమె చేసే పనేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తెలిస్తే ఇంతేనా అంటారు. లేదా ఇలాక్కూడా డబ్బులు సంపాదించొచ్చా? అని ముక్కుమీద వేలేసుకుంటారు..

జనాలకు ఈ మధ్య తెలివి పెరిగి పోతుంది..ఆ అతి తెలివితోనే కొంతమంది డబ్బులను సంపాదిస్తున్నారు..ఓ అమ్మాయి చూయింగ్ నములుతూ డబ్బుల తెగ సంపాదించేస్తోంది. ఏంటి చూయింగ్ గమ్ నములుతూ డబ్బులు కూడా సంపాదించవచ్చునా..? అని నోరెళ్లబెడుతున్నారా?

చూయింగ్ గమ్ నములుతూ బుడగలు ఊదుతుంటారు. బుడగలు ఎంత పెద్దగా వస్తే.. అంత హ్యాపీగా ఫీలవుతుంటారు. ఐతే ఆ బుడగలతో జర్మనీకి చెందిన 30 ఏళ్ల జూలియా ఫోరాట్‌ అనే మహిళ చూయింగ్ గమ్ తో బుడగలు ఊది..బిజినెస్ చేస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ భారీగా సంపాదిస్తోంది. బుడగలను అమ్ముకోవడమేంటని అనుకుంటారా? ఐతే బుడగలను నేరుగా అమ్మదు. వాటిని వీడియో తీసి.. యూట్యూబ్‌ లో పోస్ట్ చేస్తుంది. అలా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేసి బాగా సంపాదిస్తోంది..జూలియా ఫోరాట్‌కు చూయింగ్ గమ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ చూయింగ్ గమ్స్ నములుతుంటుంది. అది అలవాటుగా మారిపోయింది. ఐతే ఆ గమ్‌ను బాగా నమిలిన తర్వాత.. వాటితో బుడగలు ఊదుతుంది. ఏదో సరదాగా కోసం అలా చేసేది.

కానీ ఆమె బుడగలు ఊదటం చూసిన ఆమె స్నేహితుడు ఫిదా అయిపోయాడు. వావ్..భలే ఎంత పెద్ద బుడగో..భలే ఊదుతున్నావే..చూయింగ్ గమ్‌తో… అంత పెద్ద బుడగలు వస్తాయా? అని ఆశ్చర్యపోయాడు. వీటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, భారీగా వ్యూస్ వస్తాయని..డబ్బులు కూడా వస్తాయని చెప్పాడా ఫ్రెండ్. దాంతో ఓ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి.. అందులో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది. వారు అనుకున్నట్లుగానే.. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వ్యూస్ బాగా రావడంతో, ఆదాయం కూడా పెరిగింది.అలా నెలకు 67 నుంచి 70 వేల ఆదాయం పొందుతూ హ్యాపీగా ఉన్నారు.

జూలియా ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, మార్కెటింగ్‌లో డిగ్రీలు ఉన్నాయి. ఐతే ఆమెకు చూయింగ్ గమ్‌తో బబుల్స్ ఊదడం చాలా ఇష్టం. అలా బబుల్స్ ఊదుతూ.. ప్రతి నెలా వేలల్లో సంపాదిస్తోంది జూలియా. ఆమె ఆన్‌లైన్‌లో 90 బబుల్‌గమ్స్ ఉండే ప్యాకెట్‌ను కొంటుంది. ఒకేసారి 15-20 చూయింగ్ గమ్స్ నమలి.. వాటితో పెద్ద పెద్ద బుడగలను ఊదుతుంది.పెట్టుబడి లేదు. మార్కెటింగ్ లేదు. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆడుతూ పాడుతూనే.. నెలనెలా వేల రూపాయలను జూలియా సంపాదిస్తోంది. జూలియా చూయింగ్ గమ్స్ కొనడానికి కొనడానికి నెలకు 500 మాత్రమే ఖర్చు చేస్తూ 67 వేలు సంపాదిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు..