Amazon: లెథర్ కుర్చీ ఆర్డర్ పెడితే రక్తం పంపించారు!

ఇటీవలి రోజుల్లో ఆన్‌లైన్ డెలివరీలతో బాగా మోసపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆనియన్ కట్టర్ కోసం ఆర్డర్ పెడితే.. ఉల్లిపాయను కట్ చేసిన రింగులు పంపిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Amazon: లెథర్ కుర్చీ ఆర్డర్ పెడితే రక్తం పంపించారు!

Amazon (2)

Amazon: ఇటీవలి రోజుల్లో ఆన్‌లైన్ డెలివరీలతో బాగా మోసపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆనియన్ కట్టర్ కోసం ఆర్డర్ పెడితే.. ఉల్లిపాయను కట్ చేసిన రింగులు పంపిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటిదే అమెజాన్‌లో పెట్టిన ఓ ఆర్డర్ విషయంలో జరిగింది. లెదర్ కుర్చీ కోసం ఆర్డర్ పెడితే ఆ మహిళకు బ్లడ్ శాంపుల్ వచ్చింది.

ఆ మొత్తాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేసి ఇలా రాసింది. “లెదర్ కుర్చీ కావాలని ఆర్డర్ పెడితే.. అమెజాన్ బ్లడ్ శాంపుల్ ప్యాక్ చేసి పంపించింది. మీరు నమ్ముతారా.. నాకైతే మాటలు రాలేదని.. చెప్తూ నాకు భయం వేసింది కన్ఫ్యూజ్ అయ్యా” క్యాప్సన్ తో పోస్టు చేసింది.

ఆర్డర్ మారిందని చెప్పడానికి అమెజాన్ ను కాంటాక్ట్ అయ్యానని కుదరలేదని చెప్పిందామె.

Read Also: ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ అమెజాన్ డెలివరీ బాక్సులు
“ఇది చాలా వింతగా ఉంది. రక్తం తీసుకునే ముందు రోగి పేరు, సమాచారాన్ని ఫ్లెబ్స్ సాధారణంగా ట్యూబ్‌పై ఉంచొద్దు? అమెజాన్ వేర్‌హౌస్ నుంచి వచ్చిన బ్లడ్ శాంపుల్ మాత్రమేనా.. మరేదైనా ప్రమాదకర అంశమా.. ” అని కామెంట్ చేశారు. “అది చాలా తీవ్రమైన విషయం?? ఏ విధమైన పరిస్థితులు దారితీస్తాయో అర్థం కావడం లేదు.” అని మరొకరు కామెంట్ చేశారు.