మాస్క్ పెట్టుకుంటే లిప్ స్టిక్ పాడవుతుందన్న కష్టమర్..ఉద్యోగం వదిలేసి పోయిన వెయిటర్

మాస్క్ పెట్టుకుంటే లిప్ స్టిక్ పాడవుతుందన్న కష్టమర్..ఉద్యోగం వదిలేసి పోయిన వెయిటర్

Woman, Quits Her Job, Customer, Refuses,face Mask,

woman quits her job on spot after customer refuses to wear face mask : కరోనా వైరస్ వచ్చాక మాస్క్ తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరువాత తెరుచుకంటున్న రెస్టారెంట్లలో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని వెళ్లాల్సిందే. అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందే. కానీ కొంతమంది మాత్రం మాస్కులు పెట్టుకోమని చెబితే చాలా ఫైర్ అయిపోతున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా దాడులకే దిగుతున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్‌లో వెయిటెర్ గా పనిచేస్తున్న ఓ యువతి..మాస్కు పెట్టుకోకుండా వచ్చిన కస్టమర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎంతగా చెప్పినా సదరు కష్టమర్ మాస్కు పెట్టుకోకపోవటంతో ఆగ్రహానికి గురై..తన ఉద్యోగాన్ని వదిలేసి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన ఓ వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌ గా మారింది. ఆ రెస్టారెంట్ లో ఓ కస్టమర్ మాస్క్ ధరించకుండా రెస్టారెంట్‌కు వచ్చింది. అక్కడే ఉన్న వెయిట్రెస్ ఆమెను మాస్క్ పెట్టుకోవాలని కోరింది. దానికి ఆ కస్టమర్ అంగీకరించలేదు. పైగా ఆమెతో వాదనకు దిగింది. మీరు ఒక్కసారి మాస్క్ పెట్టుకుంటే చాలు.. మిమ్మల్ని లోపలకి అనుమతిస్తానని చెప్పింది.

దీనికి ఆ కస్టమర్ విచిత్రమైన సమాధానం ఇచ్చింది. ‘‘మాస్క్ పెట్టుకుంటే నా లిప్‌స్టిక్ పాడవుతుంది’’అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వెయిట్రెస్ ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలిపింది. అప్పటికే తీవ్ర ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న వెయిట్రెస్ ‘‘ఇటువంటివారివల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి..ఉద్యోగాలు సంపాదించటం కష్టమైపోతోంది’’ అంటూ.. ఆమె తన క్యాప్, అప్రాన్ తీసేసి ఉద్యోగం వదిలి అప్పటికప్పుడే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన కస్టమర్..మాస్క్ ధరించింది. కానీ, అప్పటికే వెయిట్రెస్ గా పనిచేసే యువతి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
https://youtu.be/eBBrZvdeHKw