ఎనిమిదేళ్ల డేటింగ్‌ తర్వాత టైం వేస్ట్ చేశాడంటూ మాజీ బాయ్ ఫ్రెండ్‌పై కేసు

ఎనిమిదేళ్ల డేటింగ్‌ తర్వాత టైం వేస్ట్ చేశాడంటూ మాజీ బాయ్ ఫ్రెండ్‌పై కేసు

పెళ్లి జరిగి ఎనిమిదేళ్ల తర్వాత విడిపోవడం అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కానీ, రిలేషన్‌షిప్ లో ఉండి ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత పెళ్లి చేసుకోకపోవడాన్ని తన టైం వేస్ట్ చేసినట్లుగా పేర్కొంటూ కేస్ ఫైల్ చేసిందో యువతి. 8సంవత్సరాల పాటు డేటింగ్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ అస్సలు తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొంది.

గెట్రూడె గోమా అనే యువతి హర్బర్ట్ సలైకీతో ఎనిమిదేళ్లుగా డేటింగ్ లో ఉంది. అతను భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటా అన్నాడే కానీ, ఒక టైం అనేది చెప్పలేదు. అవన్నీ తేల్చుకోవడానికే ఆ యువతి కోర్టు మెట్లెక్కింది.



జాంబియాలోని కోర్టుకు 26ఏళ్ల తన పార్టనర్.. రిలేషన్‌షిప్‌ను సీరియస్ గా తీసుకోలేదని చెప్పింది. అతనెప్పుడూ సీరియస్ గా ప్రవర్తించలేదు. అందుకే అతణ్ని కోర్టుకు తీసుకొచ్చా. ఎందుకంటే మా భవిష్యత్ గురించి నాకు ఐడియా ఉండాలి కదా’ అని యువతి అంటోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వారికి ఒక సంతానం కూడా ఉంది. కానీ, బాయ్ ఫ్రెండ్ ఆమె నుంచి కట్నం అడుగుతున్నాడట. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కట్నం ఖర్చు పెట్టుకుందామని అనుకుంటున్నాడట.



పెళ్లి అనేది జరగకుండా ఈ విషయం ముందుకు వెళ్లకూడదని జడ్జి చెప్పారు. కొద్ది నెలల క్రితం ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో భర్తను తనను అమితంగా ప్రేమిస్తున్నాడని ఎప్పుడూ గొడవపడట్లేదని చెప్పింది. వివాహం జరిగిన 18నెలల తర్వాత మహిళ షరియా కోర్టును సంప్రదించి విడాకులు అడిగింది.

మహిళ విడాకులు కోరడానికి గల కారణాలు తెలుసుకున్న క్లర్క్ ప్లీను రిజక్ట్ చేశారు.