Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

జిమ్‌లో ఒంటరిగా వర్కవుట్ చేస్తున్న ఒక మహిళ ఎక్విప్‌మెంట్‌లో చిక్కుకుపోయింది. తన కాలు అందులో ఇరుక్కోవడంతో తలకిందులైంది. సాయం చేసే వాళ్లెవరూ లేకపోవడంతో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

Viral video: జిమ్‌లో ఎక్విప్‌మెంట్‌పై వర్కవుట్ చేస్తున్న ఒక మహిళ తలకిందులైంది. కాళ్లు ఆ ఎక్విప్‌మెంట్‌లో ఇరుక్కోవడంతో బయటకు రాలేని పరిస్థితి. దీంతో స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. అమెరికాలోని ఓహియోకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ ఇటీవల తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో తన ఇంట్లోని జిమ్‌లో ఒంటరిగా వర్కవుట్ చేస్తోంది.

Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్

ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించి వర్కవుట్ చేస్తోంది. వెన్నెముక, బ్యాక్ పెయిన్ తగ్గేందుకు ఈ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. అయితే, ఇన్వర్షన్ టేబుల్‌పై వర్కవుట్ చేస్తుండగా, ఆమె పాదాలు అందులో ఇరుక్కుపోయాయి. అప్పుడు ఆమె తలకిందులుగా ఉంది. ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోతోంది. చాలా సేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పని మనిషిని పిలిచేందుకు ప్రయత్నించింది. కానీ, లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుండటంతో పనిమనిషికి క్రిస్టిన్ పిలుపులు వినిపించలేదు. దీంతో చివరకు అమెరికన్ ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేయాలని నిర్ణయించుకుంది.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

అది కూడా వాయిస్ కాల్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్‌తో. చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి, 911కు కాల్ చేసి, తన పరిస్థితిని వివరించింది. సాయం కోసం అర్థించింది. కాల్ రిసీవ్ చేసుకున్న పోలీస్ అధికారులు కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్నారు. తలకిందులుగా ఉన్న ఆమెను సరి చేసి, రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను క్రిస్టిన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.