Australia : 5.5 కిలోల బట్టలు వేసుకుంది.. జరిమానా కట్టింది

విమానంలో పరిమితికి మించిన బరువున్న వస్తువులపై అడిషనల్ ఛార్జెస్ విధిస్తారు. వాటి నుంచి తప్పించుకోవాలని ఓ యువతి చేసిన పనికి జరిమానా కట్టింది. చూడటానికి తమాషాగా అనిపించినా కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు.

Australia : 5.5 కిలోల బట్టలు వేసుకుంది.. జరిమానా కట్టింది

Australia

woman wearing 5.5 kg of clothes : విమానంలో అదనపు లగేజ్‌కి డబ్బులు కట్టకుండా తప్పించుకోవాలనుకుంది. ఐదున్నర కిలోల బట్టలు వేసుకుంది.  ఫలితంగా జరిమానా కట్టింది ఓ యువతి. ఇక అన్ని కిలోల బట్టల్లో విచిత్రంగా కనిపించిన ఆమెను చూసి ప్రయాణికులు నవ్వులే నవ్వులు.

UK Woman : ‘ఆ’ ఇంగ్లీషు అక్షరాలు తెచ్చిన తంటా .. మహిళా ఉద్యోగికి భారీ జరిమానా..!

19 ఏళ్ల అడ్రియానా ఒకాంపో అనే యువతి తన ఫ్రెండ్‌తో కలిసి మెల్ బోర్న్ నుండి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కి జెట్ స్టార్‌లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఆమె క్యారీ చేస్తున్న వస్తువుల బరువు గరిష్ట బరువు 7 కిలోల కన్నా ఎక్కువ ఉంది. అదనపు బరువుకి అదనంగా చార్జీలు కట్టాల్సి ఉంటుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది.

 

లగేజ్ తగ్గించడానికి అదనంగా ఉన్న దుస్తులను ధరించింది. ఇక ఆమె ఫ్రెండ్ కూడా ఈమెను ఫాలో అయ్యిందట. టీ-షర్టులు, జాకెట్లు, జంపర్లు, ప్యాంట్స్‌తో సహా ఆరు కిలోల బట్టలు వేసుకుంది. ఇక విమానంలో ఉన్నవారంతా ఒకాంపోను చూసి ఎలుగుబంటిలా ఉందని నవ్వడం మొదలు పెట్టారట. ఇన్ని ధరించినా ఇంకా పరిమితి కంటే 1 కిలో ఎక్కవ ఉందట.

Anushka Sharma : అనుష్క, అమితాబ్ బైక్ రైడ్.. ముంబై పోలీసులు ఫైన్‌.. జరిమానా ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఇక ఈమె ఐడియా బెడిసి కొట్టింది. చెకింగ్‌లో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు ఒకాంపో చేసిన పనికి రూ.65 డాలర్లు జరిమానా విధించారు. చూడటానికి ఇది తమాషాగా అనిపించినా మాకు పరిమితులు ఉన్నాయని జెట్ స్టార్ ప్రతినిధులు చెప్పారు. ఒకాంపో తెలివైన పని చేసాను అనుకుంది కానీ .. పాపం జరిమానాను నుంచి తప్పించుకోలేకపోయింది.