Pretoria : ఒకే కాన్పులో పది మంది సంతానం..కట్టుకథ, అసలు నిజమిదే

ఒకే కాన్పులో పది మంది సంతానికి జన్మనిచ్చిన మహిళకు సంబంధించిన వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ..అసలు నిజం ఏంటో బయటపడింది. పది మంది సంతానం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అప్పట్లోనే ఈమెపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

Pretoria : ఒకే కాన్పులో పది మంది సంతానం..కట్టుకథ, అసలు నిజమిదే

10 Babies

Having 10 Babies Found Fake : ఒకే కాన్పులో పది మంది సంతానికి జన్మనిచ్చిన మహిళకు సంబంధించిన వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ..అసలు నిజం ఏంటో బయటపడింది. పది మంది సంతానం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అప్పట్లోనే ఈమెపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

దక్షిణాఫ్రికా చెందిన గుటెంగ్ ప్రావియన్స్ కు చెందిన 37 ఏండ్ల గొసైమ్ మహిళ జూన్ 07వ తేదీన పెట్రోరియాలోని ఓ ఆసుపత్రిలో ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిందనే వార్త తెగ ప్రచారం అయ్యింది. తాను ఎనిమిది మంది పుడుతారని అనుకొంటే..ఏకంగా పది మంది జన్మనిచ్చారని..ఇదొక వరల్డ్ రికార్డు అంటూ…ప్రచారం చేశారు. పది మంది సంతానం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే..గొసైమ్ కనిపించడం లేదని..కుటుంసభ్యులు కంప్లైట్ చేయడంతో జూన్ 17వ తేదీన జోహన్స్ బర్గ్ లోని ఆమె బంధువుల నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది మంది సంతానం విషయంలో నిగ్గు తేల్చేందుకు సామాజిక కార్యకర్తల సహాయంతో తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో చేర్చారు. సంతానానికి జ‌న్మ‌నిచ్చ‌న క‌థ‌ను ప్ర‌చారంలో పెట్టి న‌వ‌జాత శిశువుల‌కు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తూ మిలియ‌నీర్ కావాల‌ని త‌న భ‌ర్త ప్లాన్ చేసిన‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు.

పది మంది శిశువులు పుట్టినట్లు ఆధారాలు లేవని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు…ఆమె విడుదలను కోరుతూ..కోర్టు ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తానని మహిళా తరపు న్యాయవాది రెఫెలో వెల్లడించారు.