మహిళలు హక్కులున్న జంతువులు…ఇజ్రాయేల్‌ ప్రధాని

  • Published By: venkaiahnaidu ,Published On : November 26, 2020 / 04:10 AM IST
మహిళలు హక్కులున్న జంతువులు…ఇజ్రాయేల్‌ ప్రధాని

Women are animals… with rights సామాన్యుడు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సోషల్‌ మీడియా వేదికగా వేటాడేస్తారు నెటిజనులు. ప్రస్తుతం ఇజ్రాయేల్‌ ప్రధాని ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.



రెండు రోజుల క్రితం ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయోలెన్స్‌ ఎగెనెస్ట్‌ వుమెన్‌’ అనే కార్యక్రమంలో ఇజ్రాయేల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.ప్రసంగిస్తూ.. మహిళలను జంతువులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు.



ఆయన మాట్లాడుతూ..నీవు కొట్టడానికి మహిళ జంతువు కాదు. మనందరం జంతుహింస తగదని చెప్తాం. వాటి మీద ఆప్యాయత కురిపిస్తాం.. జాలి చూపిస్తాం. మహిళలు పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంజమిన్‌.



ఇక్కడ బెంజమిన్‌ నోరు లేని మూగ జీవుల పట్ల ఆప్యాయత, జాలి చూపిస్తాం.. అలాంటిది మానవజాతి మనుగడకు మూలమైన మహిళల్ని ఇంకెంతో గౌరవించాలనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఆయన తన భావాలను సరిగా వ్యక్తం చేయకపోవడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.



మహిళల్ని జంతువులతో పోలుస్తావా అంటూ మండి పడుతున్నారు. గృహ హింస అంటే మీ దృష్టిలో జంతువులను తిట్టడం లాంటిదేనా.. అంటే మహిళలు కూడా మౌనంగా భరించాలని మీ ఉద్దేశమా అంటూ ఇజ్రాయేల్‌ ప్రధాని నోటి దురుసుపై ట్రోలింగ్‌ మొదలెట్టేశారు నెటిజన్లు.