US Army : 100 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..కఠినమైన మెరైన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళా సైనికులు

US Army : 100 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..కఠినమైన మెరైన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళా సైనికులు

Us Army Womens

US Women changed history : అమెరికా ఆర్మీలో మహిళా సైనికులు లింగ వివక్ష చివరి అడ్డంకిని అధిగమించారు. గెలుపు సంతకం చేశారు. 100 సంవత్సరాల అమెరికా ఆర్మీ చరిత్రలో అత్యంత కఠినమైన ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని తాము ఎందులోను తక్కువ కాదనినిరూపించారు మహిళా సైనికులు. కాలిఫోర్నియాలోని క్యాంప్ పెంటెల్‌టన్‌లో దాదాపు 11 వారాల కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మహిళలు ఈ కోర్సు పూర్తి చేయడం ఇదే మొదటిసారి కావటం విశేషం.

లిమా కంపెనీకి చెందిన ఉమెన్స్ ప్లాటూన్ కు చెందిన 53 మంది మహిళా సైనికులు మెరైన్ కార్ప్స్ లోని అత్యంత కష్టమైన కోర్సును పూర్తి చేసి ఆహా అనిపించారు. కాలిఫోర్నియాలోని క్యాంప్ పెంటెల్‌టన్‌లో దాదాపు 11 వారాల కఠినమైన శిక్షణ తర్వాత ఆ మహిళా ప్లాటూన్ ఇప్పుడు అధికారికంగా మెరైన్‌గా మారింది. మహిళలు ఈ కోర్సు పూర్తి చేయడం ఇదే మొదటిసారి కావటం గమనించాల్సిన విషయం. 9 ఫిబ్రవరి 2021 న శిక్షణ ప్రారంభించారు.

ఈ శిక్షణ పొందిన వారిలో 20 ఏళ్ల అబిగైల్ రాగ్లాండ్ మాట్లాడుతూ.‘‘ మహిళలు అయి ఉండి ఇంత కఠినమైన శిక్షణకు తట్టుకుంటారా? అనే సందేహంతో మిలియన్ల కళ్ళు మాపై ఉన్నాయి. కానీ మేం అనుకున్నది సాధించాలనే పట్టుదల..మహిళలంటేఏంటో చూపించాలనే పట్టుదలతో అన్నింటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నామని తెలిపారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలమవ్వాలని అనుకోలేదు..కఠినమైనదానిని కూడా విజయవంతంగా పూర్తి చేయాలనే సంకల్పతంతో ఉన్నామని తెలిపారు.

19 ఏళ్ల మరో మహిళా సైనికురాలు తన అనుభవాన్ని చెప్పుకొస్తూ..‘‘ సవాళ్లను స్వీకరించటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను మెరైన్స్ కోసం తయారైన మొదటి రోజునే ఎంత కష్టమైనా భరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే ఇడాహోకు చెందిన 19 సంవత్సరాల మియా ఓ హారా మాట్లాడుతూ..‘‘చివరి అధిరోహణలో, ప్లాటూన్ జెండా నా చేతుల్లో ఉంది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది?..ఇది మా విజయాలకు ప్రతీక అని అంతులేని ఆత్మవిశ్వాసంతో తెలిపారు.

ఈ ఆరోహణ చాలా క్లిష్టమైనది. ఇది జీవితంలోని చివరి అధిరోహణ అని చాలాసార్లు అనుకున్నాం. కానీ ఏదైనా మొదలు పెట్టాక దాని అంతు చూడనిదే వదలకూడదనే పట్టుదల మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకు స్వాగతం పలకటానికి ఎవరో ఎతైన పర్వతాలపై ఉన్నారనే నమ్మకంతో అధిరోహణ పూర్తి చేశామని తెలిపారు.ఆ నమ్మకంతోనే మా ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేశామని మహిళా సైనికులు సగర్వంగా చెబుతున్నారు. వీరంతా క్లిష్టమైన ట్రైనింగ్ పూర్తి చేసుకుని మెరైన్స్ గా నిలిచారు.

పురుష కమాండోలతో సమానంగా మహిళలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు.ట్రైనింగ్ లో ఏమాత్రం తారతమ్యాలు చూపించలేదు. తెల్లవారుజామున 3 నుండి రాత్రి వరకు అత్యంత కఠినతరమైన శిక్షణను పూర్తి చేసుకుని మెరైన్స్ గా నిలిచారు మహిళా మణులు. రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే వారికి నిద్రాసమయం. 35 కిలోల బరువుతో 15 కిలోమీటర్ల కష్టతరమైన అధిరోహణతో పాటు, పందెం, దుమ్ము, కోణాల శిఖరాలపై బురద వంటివి వాటిలో దాటడం కూడా ఈ శిక్షణలో నేర్పించారు.అటువంటి అత్యంత కఠినమైన ట్రైనింగ్ ను మగ కమాండోలతో సమానంగా పూర్తి చేసుకుని మెరైన్స్ గా నిలిచారు మహిళా సైనికులు.