Cemetery : స్మశానవాటికలో అస్థిపంజరంతో ఆడుకున్న మహిళ

ఓ మహిళ స్మశానవాటికలో అస్థిపంజరాలతో డ్యాన్స్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Cemetery : స్మశానవాటికలో అస్థిపంజరంతో ఆడుకున్న మహిళ

Cemetery

Cemetery : సింగిల్ గా స్మశానవాటిక వైపు వెళ్లాలంటే చాలామంది భయపడుతుంటారు. ఏదైనా పనిపడి అటుగా వెళ్లాల్సి వస్తే ఎవరోఒకరిని తోడు తీసుకెళ్తుంటాం. స్మశానవాటిక గుండా పోతున్న సమయంలో ఎవరైనా ఆ ప్రాంతంలో కనిపిస్తే భయపడిపోతుంటారు. ఇంకా ఏదైనా శబ్దాలు వినిపిస్తే అక్కడి నుంచి పరుగు తీయడం ఖాయం. అయితే కొంతమంది స్మశానవాటిక గుండా పోతున్న సమయంలో అస్థిపంజరంతో నృత్యం చేస్తున్న మహిళ కనిపించింది. మొదట ఆమెను చూసి వారు భయపడిపోయారు. కొంచం ఎక్కువ మంది ఉండటంతో దైర్యం చేసి ఆ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించారు.

 

Read More : Shanvi Srivastava: దివి నుంచి సాగరతీరానికి దిగొచ్చిందా!

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ ఘటన యుకెలోని హల్ సిటీలో జనరల్ స్మశానవాటిక సమీపంలో జరిగింది. సన్యాసిని వేషంలో ఉన్న ఒక మహిళ అస్థిపంజరం పక్కన నిలబడి ఉంది. ఆమె అస్థిపంజరంతో ఆడుకోవడం కూడా మీరు చూడవచ్చు. ఈ దృశ్యాలను చూడడానికి అటుగా వెళ్తున్నవారు వాహనాలు కూడా ఆపారు.

 

Read More : GHMC petition : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్

ఆ సమయంలో సన్యాసిని అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ సన్యాసిని వలె దుస్తులు ధరించింది. ఇది కాకుండా, తలపై కండువా కూడా ధరించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు భయపడిపోతున్నారు.