ముసలి వాళ్లలా వేషం వేసుకుని కరోనా టీకా

ముసలి వాళ్లలా వేషం వేసుకుని కరోనా టీకా

coronavirus vaccine : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ రూపొందించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. అమెరికాలో కూడా…వ్యాక్సిన్ నేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఎవరికి ముందు వేయాలనే దానిపై నిబంధనలు రూపొందించాయి అక్కడి ప్రభుత్వం. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తర్వాత..65 ఏండ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేయనున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే..ఇద్దరు మహిళలు..అధికారులను బురడి కొట్టించి..వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఈ ఘటన ఓర్లాండోలో చోటు చేసుకుంది.

35 నుంచి 40 ఏళ్ళ వయస్సున్న ఇద్దరు మహిళలు..65 సంవత్సరాలకు పైబడినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. టీకా వేయించుకోవాలని సమాచారం రావడంతో..ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో..ముసలి వాళ్లలా తయారయ్యారు. టీకా సెంటర్ కు చేరుకున్న అనంతరం వారి పేర్లు, సంబంధిత రిజిస్ట్రేషన్ ఐడీలను చూశారు. సరిపోవడంతో..వారికి మొదటి డోస్ టీకా వేయించేసి పంపించారు. కానీ…తర్వాత..పుట్టిన తేదీ వివరాలు చూడగా..మ్యాచ్ కావడం లేదని తెలుసుకున్నారు.

టీకా మోసంతో అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేశారు. వారు ఏ సెంటర్ నుంచి మొదటి డోస్ తీసుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి వ్యాక్సిన్ ను దొంగిలించారని ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అరెస్టు తప్పదని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.