Condester Sichwale : టైటు డ్రెస్ ధరించిన మహిళా ఎంపిని పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించిన స్పీకర్

టాంజానియా పార్ల‌మెంటులో ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. కండెస్టర్‌ సిచ్వాలే అనే మహిళా ఎంపీ టైటు డ్రెస్ వేసుకుని వచ్చిందని సాక్షాత్తూ స్పీక‌రే ఆమెను పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Condester Sichwale : టైటు డ్రెస్ ధరించిన మహిళా ఎంపిని పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించిన స్పీకర్

Tanzania Women Mp Condester Sichwale

Tanzania women MP Condester Sichwale :మహిళలు ధరించే డ్రెస్ ల గురించి కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో పలు విమర్శలు..కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటిదే జరిగింది ఆఫ్రికా దేశాల్లోని టాంజానియాలో. మహిళా ఎంపీ ధరించిన డ్రెస్ వల్ల ఏకంగా ఆమెను పార్లమెంట్ నుంచే బహిష్కరించారు. తోటి సభ్యులే ఆమె వేసుకున్న డ్రెస్ గురించి అభ్యంతరం వ్యక్తంచేవారు. వీరిలో కొంతమంది మహిళలు కూడా ఉండటం గమనించాల్సిన విషయం. టాంజానియా పార్ల‌మెంటులో కండెస్టర్‌ సిచ్వాలే అనే మహిళా ఎంపీ టైటు డ్రెస్ వేసుకుని వచ్చిందని సాక్షాత్తూ స్పీక‌రే ఆమెను పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించారు.

టాంజానియా మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే బిగుతైన‌ దుస్తులు (ఎల్లో కలర టాప్, బ్లాక్ కలర్ ప్యాంటు) ధరించి పార్లమెంట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. ఆమె పార్లమెంట్ హాల్లోకి రాగానే తోటి శాస‌న‌స‌భ్యులు ఇదేంటీ ఇలాంటి డ్రెస్ వేసుకుని సమావేశాలు వచ్చారు? అంటూ ప్రశ్నించారు. ఆమె డ్రెస్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ క్రమంలో స్పీక‌ర్ జాబ్ ఎండుగై కూడా ఆమె డ్రెస్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టసభలకు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకునిరావాలని సూచించారు. అనంతరం ఎంపీ కండెస్టర్ సియ్వాలే చ‌ర్య‌ల‌ు తీసుకున్నారు. సిచ్వాలే వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తున్నామని ఆమె వెళ్లిపోవాలని ఆదేశించారు. బ‌హిష్కరించారు. సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి సభకు రావాలని సూచించారు. సంప్రదాయదాయకరమైన బట్టలు వేసుకుని రండీ అంటూ సూచించారు. స్పీక‌ర్ ఆదేశాల‌తో ఎంపీ పార్ల‌మెంట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

కాగా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే ధరించిన ప్యాంటు గురించి హుస్సేర్ అమర్ అనే తోటి మహిళా ఎంపీ ఎగతాళిగా మాట్లాడుతూ..‘‘మిస్టర్ స్పీకర్..నా కుడివైపున కూర్చున్న నా సోదరి ధరించిన ప్యాంటు చూడండీ..పసుపు రంగు షర్టు వేసుకుంది. ఇక ఆమె ప్యాంటు గురించి చెప్పాల్సిందే. టైటు ప్యాంటు వేసుకుంది. ఇదేనా చట్టసభలకు ఆమె ఇచ్చే గౌరవం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

కాగా టాంజానియా పార్లమెట్ లో ఎంపీలు ముఖ్యంగా మహిళా ఎంపీలు ప్యాంటు ధరించవచ్చు గానీ ఇటువంటి టైటు ప్యాంట్లు వేసుకుని రావద్దని సూచనలు జారీ చేసింది. ఇటువంటి దుస్తులు పార్లమెంటరీ నిబంధనలకు వ్యతిరేకమని నిర్దేశించింది. ఈ క్రమంలో ఎంపీ సిచ్వాలే బహిష్కరణపై Jacqueline Ngonyani, స్టెల్లా మన్యన్యా నేతృత్వంలోని కొంతమంది మహిళా ఎంపీలు ఆమె వేసుకున్న డ్రెస్ గురించి బహిష్కరించటం అన్యాయమని సిచ్వాలే ధరించిన డ్రెస్సులో ఎటువంటి తప్పు లేదని వాదించారు.ప్రపంచంలో ఏ దేశంలోనైనా మహిళల దుస్తులపై అభ్యంతరాలు..విమర్శలు సర్వసాధారణమేనని ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.