Jacinda Ardern : మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా : న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా

మాతృత్వంలో మధురిమలను మనసారా ఆస్వాదించటానికి తన రాజకీయ జీవితాన్నే వదులు కున్నారు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని స్పష్టంచేశారు జెసిండా.

Jacinda Ardern : మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా : న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా

Jacinda Ardern motherhood politics

Jacinda Ardern: మాతృత్వంలో మధురిమలను మనసారా ఆస్వాదించటానికి తన రాజకీయ జీవితాన్నే వదులు కున్నారు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. ప్రపంచమంతా కోవిడ్ తో పోరాడుతుంటే..న్యూజిలాండ్ మాత్రం కోవిడ్ ను కట్టడి చేయటంలో తీసుకున్న వినూత్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. కోవిడ్ ను కట్టడి చేయటంతో అప్పుడు ప్రధానిగా ఉన్న జెండా తీసుకున్న నిర్ణయాలే కారణం. టీవీ లైవ్ లో కోవిడ్ గురించి అవగాన కల్పిస్తూ కేసుల కట్టడిలో ప్రపంచమంతా న్యూజిలాండ్ అవలంభించిన విధానాలపై దృష్టి సారించేలా చేశారుజెసిండా.

2017నుంచి న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జెసిండా తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత గత జనవరిలో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తాను రాజకీయాల నుంచి కూడా వైదొలగుతున్నానంటూ మరో సంచలన ప్రకటన చేశారు. తాను మంచి తల్లిగా ఉండటానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మాతృత్వం అడ్డు కాకూడదంటూ చెప్పుకొచ్చారు జెసిండా. న్యూజిలాండ్ పార్లమెంట్‌లో వీడ్కోలు సభలో ప్రసంగించిన ఆమె తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని దీనిపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

PM Jacinda livestrm : లైవ్ లో మాట్లాడుతున్నన్యూజిలాండ్ ప్రధాని జెసిండా..‘మమ్మీ’అంటూ వచ్చిన కూతురు..ఇంట్రెస్టింగ్ సీన్

ఇంకా జెసిండా మాట్లాడుతు..‘‘మంచి తల్లిగా ఉండేందుకే నేను రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నా.. లేబర్‌ పార్టీ నాయకురాలిగా ఎన్నికైనప్పుడు నేను నా మాతృత్వాన్ని కోల్పోవాలని అనుకోలేదు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంతో సంతోషించాను. రాజకీయ నాయకులు కూడా మనుషులేకదా..వారికి ప్రేమానురాగాలు, మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని అనుకుంటారుగా. ప్రజలకు సేవ చేవ చేయటానికి వ్యక్తిగత అవసరాలు..బాధ్యతలు అడ్డుకాకూడదు. మన వారి కోసం సమయం కేటాయించాల్సి ఉంటుంది. నాకు ఇప్పుడా సమయం వచ్చింది. దేశానికి నాయకత్వం వహించడం చాలా బాధ్యతతతో కూడుకున్నది. ఇది చాలా ముఖ్యమైనది, ఎంతో ఉన్నతమైంది. ప్రస్తుతం వాతావరణ మార్పు మన ముందు ఉన్న పెద్ద సంక్షోభం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సందర్భంగా అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పర్యావరణ పరిక్షణ విషయంలో మాత్రం రాజకీయాలు చేయకండి. రాజకీయాలను దానికి దూరంగా ఉంచండి’’ అని ప్రసంగించారు.

Jacinda Ardern and Sanna Marin: మహిళా ప్రధానులకు జర్నలిస్ట్ విచిత్ర ప్రశ్న.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు..

2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికైన జెసిండా.. 2018లో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రధానిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళా ప్రధానిగా నిలిచారు. ఓ పక్క తల్లిగా మరోపక్క దేశ ప్రధానింగా బాధ్యతలను సమన్వయం చేసుకుంటునే కోవిడ్ మహమ్మారితో పాటు ఎన్నో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీటిలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో జెసిండా అవగాహనకార్యక్రమాలతోను..వినూత్న నిర్ణయాలతోను దేశాన్ని నడిపించిన తీరుకు ప్రపంచమంతా ప్రశంసలు కురిపించింది. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన జెసిండా ‘క్రైసిస్‌ మేనేజర్‌’ అనే బిరుదును సంపాదించుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ కోల్పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాను ప్రధాని పదివికి రాజీనామా చేయటమే కాకుండా తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని..మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు జెసిండా స్పష్టంచేశారు.

Read more : PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్

జెసిండా ప్రధానిగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించిన తీరు…ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్ వైరల్ అయ్యాయి. వాటిలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం..

‘‘నేను గంజాయి తాగాను’’ : జెసిండా
జెసిండా రాజకీయమంతా సంచలనాలనే అని చెప్పుకోవాలి. ‘‘నేను గంజాయి తాగాను’’ అంటూ 2020 అక్టోబర్ 17న జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో బహిరంగంగా చెప్పటం ఎన్నికల ప్రచారంలో అత్యంత బలమైన..యానిమేటెడ్ నాయకుల చర్చలో జసిందా ఈ విషయాన్ని అంగీకరించటం సంచలనంగా మారింది.

లైవ్ జెసిండా..సడెన్ గా మమ్మీ అంటూ వచ్చేసిన మూడేళ్ల కూతురు..
కోవిడ్ విషయంలో జెసిండా జాతిని ఉద్ధేశించి ప్రశసంగిస్తుండగా ఆమె మూడేళ్ల కూతురు ‘మమ్మీ’ అంటూ లైవ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. దీంతో ఆమె ఏమాత్రం తత్తరపడకుండానే చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తు..తన చిన్నారి కూతురు చిన్నబుచ్చుకోకుండా ఓ అమ్మలా మారిపోయారు జెసిండా..లైవ్ ‘డాలింగ్… ఇంకా పడుకోలేదా? ఇది పడుకునే టైమ్ వెళ్లి పడుకో..ఒక నిమిషంలో వచ్చేస్తా’ అంటూ కూతురుతో మాట్లాడారు. ఆ తరువాత నవ్వుతూ ‘దయచేసిన అందరూ నన్ను క్షమించాలి’ అంటే అమ్మ కాస్తా ప్రధానిగా మారిపోయి క్షమాపణ అడిగారు. సడెన్ గా కూతురు లైవ్ లోకి వచ్చిన సమయంలో జెసిండా ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి అప్పట్లో..

ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్
జెసిండా ప్రధానిగా ఉన్న సమయంలో కరోనా మహమ్మారి విషయం గురించి ఆమె ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆమెతో పాటు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ‘అక్లాండ్‌ నగరంలోని ఓ హాస్పిటల్‌లో కోవిడ్ సోకి చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ.. అతనితో శృంగారంలో పాల్గొందనే వార్తలు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రోగితో అలా చేయటం ప్రమాదంపైగా అది కరోనా వ్యాప్తికి కారణమవుతుంది కదా? అని ప్రశ్నించగా జెసిండా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని.. `కరోనా పరిస్థితుల్లోనే కాదు..మరే పరిస్థితుల్లో కూడా హాస్పిటల్‌లో అటువంటివి చేయకూడదు‘ అని సమాధానం చెప్పారు. రిపోర్ట్ అడిన ప్రశ్నకు జసిందా ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.