ఆమె వెరీ స్పెషల్‌ గురూ : రోబో న్యూస్ యాంకర్

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 04:48 AM IST
ఆమె వెరీ స్పెషల్‌ గురూ : రోబో న్యూస్ యాంకర్

టెక్నాలజీ ఊహించనంతగా డెవలప్ అయిపోతోంది. టెక్ వినియోగంతో ఎంతగా అభివృద్ది చెందిందీ అంటే మనుష్యులు చేసే ప్రతీ పనీ రోబోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలో రోబో యాంకర్ వార్తల్ని చదివేస్తు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ యాంకర్స్ వార్తలు చదవటం సర్వసాధారణం. ఇప్పుడు వారి ప్లేస్ లో రోబో యాంకర్ వార్తల్ని చదివేస్తు..అందరి ప్రశంసల్ని పొందుతోంది. మరి అది ఎక్కడో ఆ రోబో యాంకర్ విశేషాలేమిటో తెలుసుకుందాం.

అది చైనాలోని షిన్హువా న్యూస్‌ చానల్‌. ఆ ఆఫీస్‌లో ఓ కొత్త మహిళా న్యూస్‌ యాంకర్‌ చేరారు. ఆమె వార్తలు చదువుతుంటే అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఆమె మనిషి కాదు ఓ రోబో. రోబోలు ఇప్పటి వరకూ చాలా పనులు చేయటం గురించి మనం విన్నాం..కానీ కృత్రిమ మేధస్సు సాంకేతికతతో కంప్యూటర్‌ ద్వారా తయారుచేసిన రోబో న్యూస్ ప్రెజెంటర్ గా వార్తలు చదువుతోంది. ఆమె  పేరు షిన్‌ షియావోమెంగ్‌. అలవోకగా..మనష్యుల్లా చక్కగా వార్తలు చదువేస్తోంది. షిన్‌ షియావోమెంగ్‌ తీర్చిదిద్దినట్లు ముచ్చటగా ఉందంటు అందరూ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ..చైనాలో ఈమె తొలి న్యూస్‌ యాంకర్‌గా రికార్డులోకెక్కింది.

ఇటీవల సౌదీ అరేబియా పౌరసత్వం పొందిన సోఫియా (రోబో) గుర్తింది కదా.. అచ్చు అలాంటిదే ఈ రోబో (షిన్‌ షియావోమెంగ్‌)కూడా. ఇప్పటివరకూ ఈమె చైనీస్‌ భాషలో మాత్రమే వార్తలను చదవగలుగుతుందట. కాగా, మూడు నెలల ముందే కృత్రిమ మేధతో వార్తలు చదివే ఇద్దరు పురుష యాంకర్లను కూడా  షిన్హువా న్యూస్‌ చానల్‌. నియమించుకుంది. ఈ రోబోలు దాదాపు 3,400 వార్తలను చదివి వినిపించారని  షిన్హువా న్యూస్‌ చానల్‌.  తెలిపింది. మరి న్యూస్ చానల్స్ పోటీని తట్టుకోవాలంటే ఏదోక ప్రత్యేక ఉండాలి మరి.