Women Blender Masters : లక్షా 50 వేల రకాల విస్కీలు రుచి చూసిన మహిళా బ్లెండర్ మాస్టర్

Women Blender Masters : లక్షా 50 వేల రకాల విస్కీలు రుచి చూసిన మహిళా బ్లెండర్ మాస్టర్

Women Blender Masters Rachel Barrie (1)

Women Blender Masters Rachel Barrie : స్కాట్లాండ్‌కు చెందిన రాచెల్ బార్రీ ప్రొఫెషన్ చాలా చాలా డిఫరెంట్. అతికొద్ది మంది మహిళా బ్లెండర్ మాస్టర్లలో ఒకరు. ఈమె చేసే పని, మద్యం తయారీ సంస్థలో విస్కీ రుచి, వాసన చూడటమే. రాచెల్ చేసే పని ఏంటీ అంటే మద్యం తయారీ సంస్థలో విస్కీ రుచి, వాసన చూడటం. కేవలం వాసన చూసి..రుచి చూడటమే కాదు..దాని ప్లేవర్ ఎలా ఉంది? దాన్ని ఇంకా బెటర్ గా చేయటానికి ఏవేవీ ఎంత మోతాదులో తీసుకోవాలో చెప్పాలి.

10

ఎలాగంటే..హోటళ్లలో వంటకాలను మాస్టర్ షెఫ్ ఎలా రుచి చూస్తారో..అలాగే విస్కీ తయారీ సంస్థల్లో ‘మాస్టర్ బ్లెండర్’ ఉంటారు. రాచెల్ విస్కీ రుచి..వాసన చూసి అది ఎలా ఉంది? దాన్ని ఇంకా టేస్టీగా ఎలా చేయాలి? ఆమె చూసి చెప్పే దాన్ని బట్టే బ్రాండ్ విలువ పెరుగుతుంది. దాన్ని బట్టే అమ్మకాలు పెరుగుతాయి. అలా రాచెల్ బార్రీ దాదాపు 30ఏళ్లుగా అదే పనిచేస్తున్నారు. అలా ఆమె ఇప్పటి వరకు లక్షా 50 వేల రకాల విస్కీ వాసన, రుచి చూశానని రాచెల్ చెబుతున్నారు.

3

బ్లెండెడ్ విస్కీ తయారీ ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. దాదాపు 50 రకాల తృణధాన్యాలు, గింజలను నానబెట్టి, బట్టీలలో పులియబెడతారు. వాటినుంచి మద్యాన్ని తయారు చేస్తారు. ఈ తయారీలో రాచెల్ బార్రీ పాత్ర కీలకమనే చెప్పాలి. విస్కీ తయారీ..దాని టేస్ట్ ఆమె చూసి చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. విస్కీ తయారీ బెటర్ గా ఉంటానికి ఏ ఫ్లేవర్ కోసం ఏ ధాన్యం ఎంత మోతాదులో తీసుకోవాలి? అన్న విషయాలను కూడా ఈ మాస్టర్లే చూస్తారు.

2

డిఫరెంట్ టైప్ ఆప్ ఫ్లేవర్ల గుర్తించాలి..
పలు కంపెనీల విస్కీలు ఒక్కొక్కటీ ఒక్కో టేస్టుతో ఉంటాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు డిఫరెంట్ టైప్ ఆప్ ఫ్లేవర్లను తీసుకొస్తుంటాయి. అలా ప్లేవర్లు తీసుకొచ్చేటప్పడు ఈ మాస్టర్ బ్లెండర్ల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. వాళ్లు చూసి చెప్పే విధానాన్ని బట్టే ఆ విస్కీ టేస్టు ఉంటుంది. ఈ టేస్ట్ ఉంటే డిఫరెంట్ గా ఉంటుందని..అటువంటి టేస్ట్ రావాలంటే ఏమేమీ తృణధాన్యాలు, గింజలు వాడాలి? అవి ఏఏ మోతాదుల్లో వాడాలో మాస్టర్లే చెబుతారు. అలాగే పాత రకాల్లోనూ రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? లేదా? అని ప్రతి బ్యాచ్‌లోనూ మాస్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది.వాసనలో, రుచిలో కొద్దిపాటి తేడాలు వచ్చినా గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని చాలా నిశితంగా గుర్తించాలి. అలా రాచెల్ బార్రీ సంవత్సరంలో కొన్ని వేల రకాల విస్కీ రుచి చూస్తాననని చెబుతుంటారు.

4

‘స్కాచ్ విస్కీ మాస్టర్ బ్లెండర్’గా రాచెల్‌ గుర్తింపు
ఈ సందర్భంగా రాచెల్ మాట్లాడుతూ..”ఒక మాస్టర్ బ్లెండర్‌గా విస్కీ నాణ్యతను చూడాల్సిన బాధ్యత నాదే. అందులో వాడే తృణధాన్యాల ఎంపిక నుంచి విస్కీ నింపేందుకు బాటిల్స్ వరకూ అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి..దాని కోసం విస్కీలో వాడే తృణధాన్యాల గురించి, వాటిని నానబెట్టటం, పులియబెట్టడం, ఆ తర్వాత దాని నుంచి మద్యాన్ని తీయడం గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత తయారైన శాంపిళ్లను వాసన చూడాలి. రుచి చూడాలి. ఆ తరువాత మార్పులు చేయాల్సి వస్తే చేయాలి.

11

“బ్లెండెడ్ విస్కీలో దాదాపు 150 నుంచి 200 రకాల వాసనలు ఉంటాయి. వాటిలో తేడాలను పసిగట్టగలగాలి..ఒకదానికి మరొకదానికి ఉండే తేడాను బాగా గుర్తించాలని రాచెల్ చెబుతుంటారు. ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందనీ..ఏమాత్రం తేడా వచ్చినా భారీ ఎత్తును పెట్టిన ఖర్చు వేస్టు అవుతుంది. కంపెనీ బ్రాండ్ దెబ్బతింటుంది.

5

బ్లెండర్ మాస్టర్ గా పనిచేయాలంటే ముక్కూ నాలుక బాగా పనిచేయాలి..
“దీనికి గురించి రాచెల్ ముక్కూ..నాలుక పనిచేయటం చాలా చాలా ముఖ్యమని అంటారు. అందుకే ..నా ముక్కు, నాలుక చాలా సున్నితంగా ఉన్నాయి కాబట్టే నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నానని నవ్వుతూ చెబుతారామె. అందుకు నేను ఆహారం తినే విషయం తగిన జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. అచ్చం ఎలాగంటే గాయకులు తమ గొంతు శ్రావ్యంగా ఉండటానికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు బ్లెండర్లు కూడా తమ వాసన, రుచి చాలా సునిశితమైన ఫ్లేవర్లను గురించిటానికి ఘాటు తక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తింటారు. రాచెల్ కూడా అటువంటి జాగ్రత్తలే తీసుకుంటానని తెలిపారు. వాసన వెదజల్లే సుగంధ లేపనాలు, అత్తర్లు, సెంటులు అస్సలు వాడను. పచ్చి ఉల్లిగడ్డలు అస్సలు తీసుకోనని చెబుతారు.

8

1980లో బ్లెండర్ మాస్టర్ గా ఉద్యోగంలో చేరిన రాచెల్ బార్రీ
1980లో తాను ఉద్యోగంలో చేరినప్పుడు కేవలం రెండు మూడు ఫ్లేవర్లలో మాత్రమే విస్కీ ఎక్కువగా దొరికేవి. కానీ, ఇప్పుడు ఎన్నో రకాల రుచులు దొరుకుతున్నాయి. ఒక్కో వ్యక్తి ఒక్కో ఫ్లేవర్ ఇష్టపడుతున్నారని రాచెల్ చెప్పుకొస్తారు. తనకు ఏడెనిమిదేళ్లు ఉన్నప్పుడు తాను విస్కీ టేస్ట్ చేశానని..నాకు జలుబు చేస్తే మా అమ్మమ్మ వేడి నీళ్లు, తేనె, నిమ్మరసం, కొంచెం విస్కీ కలిపి ఇచ్చింది. ఆ టేస్ట్ భలే గమ్మత్తుగా ఉంది. దాన్ని ఇప్పటికీ మరచిపోలేనని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు రాచెల్.