Work-From-Home: ఆ దేశంలో హక్కుగా మారనున్న ‘వర్క్ ఫ్రమ్ హోమ్’

ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్స్ ప్రయత్నిస్తుంది. గత వారమే డచ్ పార్లమెంట్ దిగువ సభ.. దీనికి సంబంధించి చట్టాన్ని ఆమోదించింది.

Work-From-Home: ఆ దేశంలో హక్కుగా మారనున్న ‘వర్క్ ఫ్రమ్ హోమ్’

Wfh

Work-From-Home: ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్స్ ప్రయత్నిస్తుంది. గత వారమే డచ్ పార్లమెంట్ దిగువ సభ.. దీనికి సంబంధించి చట్టాన్ని ఆమోదించింది. యూరోపియన్ దేశం ఇప్పుడు సెనేట్ ఆమోదం కోసం మాత్రమే వేచి ఉండాల్సిన పరిస్థితి.

నెదర్లాండ్స్‌లోని యజమానులు ఎటువంటి కారణం చెప్పకుండా ఇంటి నుంచి పనిచేయడాన్ని గురించి కార్మికులు చేసే అభ్యర్థనను తిరస్కరించవచ్చు. కొత్త చట్టం ఆమోదం పొందితే మాత్రం.. యజమానులు అటువంటి అభ్యర్థనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వాటిని తిరస్కరించడానికి తగిన కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది.

“ఇది మెరుగైన పని-జీవిత సమతుల్యతను కనుగొనడానికి ప్రయాణానికి వెచ్చించే సమయాన్ని తగ్గించడానికి వీలుగా ఉంటుంది” అని గ్రోన్‌లింక్స్ పార్టీకి చెందిన సెన్నా మాటౌగ్ చెప్పారు. కొత్త బిల్లు నెదర్లాండ్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్ 2015కి సవరణగా మారనుంది. కార్మికులు తమ పని గంటలు, షెడ్యూల్, పని ప్రదేశం మార్పుల కోసం రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

Read Also : భారత విమానాలపై బ్యాన్ ఎత్తేసిన నెదర్లాండ్స్

నెదర్లాండ్స్ కార్మికుల హక్కులకు ఇప్పటికే మంచి గౌరవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు కార్మికులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడానికి కష్టపడుతున్న సమయంలో కొత్త చట్టం పెనుమార్పును తీసుకురానుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి తీసుకురావడంలో సదుపాయాలు పెంచుతుండగా, మరికొన్ని శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి.