Foxconn Offer : రాజీనామా చేస్తే లక్ష రూపాయలు.. ఉద్యోగులకు ఫాక్స్‌కాన్ ఆఫర్

చైనా కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలతో అంతర్జాతీయంగా పరువు పొగొట్టుకున్న ఐ-ఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్ కాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ కార్మికుల్లో 20వేల మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

Foxconn Offer : రాజీనామా చేస్తే లక్ష రూపాయలు.. ఉద్యోగులకు ఫాక్స్‌కాన్ ఆఫర్

Foxconn Offer : చైనా కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలతో అంతర్జాతీయంగా పరువు పొగొట్టుకున్న ఐ-ఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్ కాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ కార్మికుల్లో 20వేల మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో ఎవరైనా రాజీనామా చేసి వెళ్లిపోవాలనుకుంటే వారికి లక్ష రూపాయలు ఇస్తామని ఫాక్స్ కాన్ ప్రకటించింది. కంపెనీ ఈ ప్రకటన చేసిన వెంటనే రాజీనామా చేసేందుకు కార్మికులు క్యూ కట్టారు.

కరోనా కఠిన నిబంధనలు, జీతాల బకాయిలపై నాలుగు రోజుల క్రితం కార్మికులు తెలిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కార్మికులను చైనా పోలీసులు కొడుతున్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై తక్షణమే స్పందించిన ఫాక్స్ కాన్ క్షమాపణలు తెలిపింది. రిక్రూట్ మెంట్ టైమ్ లో జరిగిన సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది.

ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్ కాన్ భావించింది. కానీ, కార్మికుల ఆందోళన, రాజీనామాలతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జెంగ్ జౌ లోని ఈ ప్లాంట్ ప్రపంచంలోనే పెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ. కరోనా కట్టడి కోసం చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానంతో ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చైనా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కార్మికులకు ఫ్యాక్టరీలోనే వసతులు కల్పించి వారిని లాక్ డౌన్ చేసింది.

అయితే, ఈ నిబంధనలు తట్టుకోలేక పెద్ద సంఖ్యలో కార్మికులు ఐ-ఫోన్ ఫ్యాక్టరీ విడిచి వెళ్లిపోయారు. వారి స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను నియమించుకుంది ఐఫోన్. అయితే, వారిపైనా కఠినమైన కరోనా నిబంధనలు అమలు చేయడం, చెప్పిన మేర జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు.

అయితే, వారి న్యాయపరమైన డిమాండ్లు పరిశీలించకుండా చైనా పోలీసులు దమనకాండకు దిగారు. పోలీసుల తీరుపై చైనా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత ఫాక్స్ కాన్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.