World Bank: ఇండియా కోసం వరల్డ్ బ్యాంక్ 500మిలియన్ డాలర్ల లోన్ అప్రూవల్

కొవిడ్ సంక్షోభం కారణంగా.. సమస్యల్లో ఇరుక్కుపోయిన ఇండియాకు సాయం చేసేందుకు 500 మిలియన్ డాలర్లు (రూ.3వేల 717.28కోట్లు) అప్పును అప్రూవల్ చేసింది వరల్డ్ బ్యాంక్.

World Bank: ఇండియా కోసం వరల్డ్ బ్యాంక్ 500మిలియన్ డాలర్ల లోన్ అప్రూవల్

World Bank

World Bank : కొవిడ్ సంక్షోభం కారణంగా.. సమస్యల్లో ఇరుక్కుపోయిన ఇండియాకు సాయం చేసేందుకు 500 మిలియన్ డాలర్లు (రూ.3వేల 717.28కోట్లు) అప్పును అప్రూవల్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఈ విషయాన్ని బుధవారం ప్రకటిస్తూ.. ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితుల్లో మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి రాష్ట్రాలకు సాయం చేయాలని వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ లో పేర్కొంది.

ఈ 500మిలియన్ డాలర్ల కమిట్మెంట్.. లో 112.50 మిలియన్ డాలర్లు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి వస్తుండగా, 387.50 మిలియన్ డాలర్లు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్(ఐబీఆర్డీ) నుంచి రానున్నాయి.

ఐదేళ్ల గ్రేస్ పీరియడ్ తో కలిపి ఈ లోన్ మెచ్యూరిటీ పీరియడ్ 18.5 సంవత్సరాలు. మొత్తం ఫండింగ్ ఇండియాలో సామాజిక భద్రతా కార్యక్రమాలైన పేదలకు సాయం, ఇళ్లు లేని వారికి గృహ నిర్మాణం చేయడం కోసం రూ.12వేల 264.54కోట్లు ఖర్చు పెట్టాలని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.