కరోనాపై ముందే హెచ్చరించాం.. అయినా పట్టించుకోలేదు : WHO

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 01:59 AM IST
కరోనాపై ముందే హెచ్చరించాం.. అయినా పట్టించుకోలేదు : WHO

కరోనా వైరస్ వ్యాప్తిపై ముందే ప్రపంచ దేశాలను హెచ్చరించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ అన్నారు. తాము హెచ్చరికలను పట్టించుకున్న దేశాలు జాగ్రత్త పడటంతో కరోనాను కట్టడి చేయడంలో మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. తమ సలహాలు, సూచనలను పట్టించుకోకపోతే ఇలాంటి అనార్థలే జరుగుతాయని, చెప్పినప్పుడు వింటే ఈ సమస్య వచ్చేది కాదని అమెరికాను ఉద్దేశించి ట్రెడోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30నాడే అంతర్జాతీయంగా కొవిడ్-19 అత్యవసర పరిస్థితి ప్రకటించిందని గుర్తు చేశారు. అప్పటికీ చైనాయేతర దేశాల్లో 82 కేసులు ఉన్నాయి. ఒక్క మరణం కూడా నమోదు కాలేదని చెప్పారు. ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలను విని జాగ్రత్తగా ఆచరించి ఉండాల్సిందన్నారు. సమగ్రమైన ప్రజారోగ్య విధానాన్ని అవలంబించాల్సిందిగా ప్రపంచ దేశాలను హెచ్చరించామన్నారు.

ఫైండ్, టెస్ట్, ఐసోలేట్ అండ్ కాంటాక్ట్ ట్రేసింగ్ సూచించామన్నారు. పాటించిన దేశాలు కరోనా విషయంలో మిగితా వాటి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ వ్యాప్తిని గురించిన వివరాలను దాచి ఉంచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ అరోగ్య సంస్థకు నిధులను ఇవ్వబోమంటూ అమెరికా విరమించుకున్న సంగతి తెలిసిందే.