World Happiness Report: ప్రపంచ ఆనంద సూచీలో 10 స్థానాలు ఎగబాకిన భారత్.. అయినా అట్టడుగునే

ఏడాది కాలానికి పైగా తీవ్ర యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా తాజా నివేదికలో మంచి స్థానాల్ని సంపాదించడం గమనార్హం. ఇండెక్స్ ప్రకారం, రష్యా 70వ ర్యాంక్ సాధించింది. గతంలో ఈ దేశానికి 80వ ర్యాంక్ వచ్చింది. అయితే ఉక్రెయిన్ సైత 98 నుంచి 92వ ర్యాంకు ఎగబాకింది.

World Happiness Report: ప్రపంచ ఆనంద సూచీలో భారత్ గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగే అనిపించుకుంది. గతేడాది భారత్ ర్యాంకు 136 కాగా, ఏడాదిలో 10 స్థానాలకు ఎగబాకి ఈసారి 126వ స్థానంలో నిలిచింది. 10 పాయింట్లకు గాను భారత్ 4.036 స్కోర్ చేసింది. అయితే గతేడాదితో ర్యాంకు కాస్త మెరుగుపడినప్పటికీ.. మొత్తంగా చూసుకుంటే భారత్ అట్టడుగునే ఉందని చెప్పవచ్చు. మొత్తం 146 దేశాల జాబితాలో 126వ స్థానం అంటే ప్రపంచ స్థాయిలో మన దేశం ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని నాన్ ప్రాఫిట్ సంస్థ విడుదల చేసిన హ్యాప్పీనెస్ ఇండెక్స్ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడించారు.

Amritpal singh: 80,000 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? అమృతపాల్ సింగ్ కేసుపై పంజాబ్ ప్రభుత్వాన్ని గద్దించిన హైకోర్టు

ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రతి సంవత్సరం ఈ నివేదికను ప్రచురిస్తుంది. 2020 నుంచి 2022 మధ్య గాలప్ వరల్డ్ పోల్స్ నిర్వహించి సేకరించిన డేటా ఆధారంగా తాజా రిపోర్ట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆరు అంశాలు – స్థూల దేశీయోత్పత్తి, ఆయుర్దాయం, దాతృత్వం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, అవినీతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జీవిత మూల్యాంకనానికి ఇది దోహదపడుతుందని అంచనా వేశారు.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇకపోతే.. భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మన కంటే ముందు స్థానంలో ఉండడం గమనార్హం. పాకిస్తాన్ 108వ స్థానం, బంగ్లాదేశ్ 118వ స్థానం, శ్రీలంక 112వ స్థానం, నేపాల్ 78వ స్థానాల్లో ఉన్నాయి. ఇకపోతే, ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఆ దేశానికి 10 పాయింట్లకు గాను 7.804 పాయింట్లు సాధించింది. మరో రెండు నార్డిక్ దేశాలే రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. డెన్మార్క్ రెండో స్థానంలో ఉండగా, ఐస్లాండ్ మూడో స్థానంలో నిలిచింది.

Chetan Kumar Arrested: హిందుత్వం మీద అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ అరెస్ట్

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ జాబితాలో మొదటి పది దేశాలలో ఎనిమిది దేశాలే ఐరోపా దేశాలే కావడం. ఇక ఐరోపా కాకుండా మొదటి పది స్థానంలో నిలిచిన ఆ రెండు దేశాలు ఇజ్రాయెల్, న్యూజిలాండ్. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఏడాది కాలానికి పైగా తీవ్ర యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా తాజా నివేదికలో మంచి స్థానాల్ని సంపాదించడం గమనార్హం. ఇండెక్స్ ప్రకారం, రష్యా 70వ ర్యాంక్ సాధించింది. గతంలో ఈ దేశానికి 80వ ర్యాంక్ వచ్చింది. అయితే ఉక్రెయిన్ సైత 98 నుంచి 92వ ర్యాంకు ఎగబాకింది.

ట్రెండింగ్ వార్తలు