World population @ 800 Crores : 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా..! ఎదురయ్యే సవాళ్లు..!!

ఈరోజు నవంబర్ 15 (2022). ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చగా అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట. పెద్దలు మాట సద్దన్నం మూట అని కూడా అంటారు. మరి ప్రపంచ వ్యాప్తంగా మంది పెరిగారు. మరి సమస్యలు కూడా పెరుగుతాయి కదా..మరి అవి ఎటువంటి సమస్యలో ? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందో కూడా తెలుసుకోవాలో కూడా ఐక్యరాజ్యసమితి తన నివేదికల్లో ప్రస్తావించింది.

World population @ 800 Crores : 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా..! ఎదురయ్యే సవాళ్లు..!!

Today the world population is @ 800 crores

Today the world population is @ 800 crores  : ఈరోజు నవంబర్ 15 (2022). ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చగా అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట. పెద్దలు మాట సద్దన్నం మూట అని కూడా అంటారు. మరి ప్రపంచ వ్యాప్తంగా మంది పెరిగారు. మరి సమస్యలు కూడా పెరుగుతాయి కదా..మరి అవి ఎటువంటి సమస్యలో ? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఐక్యరాజ్యసమితి తన నివేదికల్లో ప్రస్తావించింది.

జనాభా పెరిగినా..శాస్త్రీయ పురోగతి, పోషకాహారం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడిన విషయాన్ని ప్రస్తావిస్తూనే..మానవ ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కోనుంది అని కూడా సూచించింది ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో..ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకుంది. ఇది ఓ సంఖ్య మాత్రమే. ఇది ఏదో ఒకరాత్రిలో జరిగిపోయింది కాదు. దానికి తగినట్లుగానే అన్ని ఉంటాయనే విషయం మర్చిపోకూడదు.

కోవిడ్ మహమ్మారి..యుక్రెయిన్ యుద్ధంతో ఆకలి కేకలు..
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది నేటికీ ఆకలి బాధతో అలమటిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో పాటు యుక్రెయిన్ యుద్ధం ఆహార, ఇంధన సంక్షోభాలకు ఆజ్యం పోసింది. 1.4 కోట్ల చిన్నారులు తీవ్ర పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, వంటి ఇతర సమస్యల వల్ల 45 శాతం చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2019-2022 మధ్య పోషకాహార లోపం బాధితుల సంఖ్య 15 కోట్ల మేర పెరిగింది. 2021 నాటికి 69.8 కోట్లు (జనాభాలో 9 శాతం) తీవ్ర పేదరికంలో ఉన్నారు. దారుణమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని ప్రజలు అందరికీ సరిపడా ఆహారం ఉంది. కానీ, అది వృథా అవుతోంది. ఉత్పత్తి అవుతున్న ఆహార గింజల్లో ఒక వంతు ఖర్చు కావడం లేదు. పంట సాగు నుంచి రిటైల్ చేసే వరకు 14 శాతం, ఇళ్లు, రెస్టారెంట్లు, స్టోర్ల వద్ద 17 శాతం వృథా అవుతోంది.

World population..UN : 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా.. 2023లో చైనాను దాటేయనున్న భారత్

వాతావరణ మార్పులు..పెరుగుతున్న ఉపద్రవాలు
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వచ్చే ఉత్పాతాలు కూడా ఒక సవాలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాలు పంటల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. ప్రజల డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి ఉండదు. కాలుష్యం పెరగటంతో ఉష్ణోగ్రతల పెరుగుదల అనేవి ప్రకృతి విపత్తులకు దారి తీస్తున్నాయి. వరదలు, తుపానులు విరుచుకుపడుతూ.. కరవులకు కారణమవుతున్నాయి. వీటి కారణంగా గడిచిన 50 ఏళ్లలో సగటున రోజూ 115 మంది చనిపోయారు. 202 మిలియన్ డాలర్ల నిధులు వృథా అయ్యాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల వాతావరణ సంక్షోభాలను పెంచుతున్నాయి.

పట్టణీకరణతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
పట్టణీకరణ పెరగటంతో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో 56 శాతం (440 కోట్లు) పట్టణాల్లోనే జీవిస్తున్నారు. 2050 నాటికి పట్టణ జనాభా ప్రస్తుతమున్న దాని నుంచి రెండింతలకు పైగా పెరుగుతోంది. ఇది రానున్న రోజుల్లో ఇంకా పెరుగే అవకాశాలున్నాయి. ప్రతి 10 మందిలో 7 మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. పట్టణ జనాభా పెరుగుతుంటే ఇళ్లకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. రవాణా వసతులు, సౌకర్యాలు, ఉపాధి.. ఇవన్నీ కూడా సవాళ్లు కానున్నాయి. దీనివల్ల భూమి, నీరు, సహజ వనరులపై ఒత్తిళ్లు పెరుగుతాయి. పర్యావరణ అనుకూల, స్మార్ట్ సిటీ రూపొందించడమే దీనికి పరిష్కారమని నిపుణుల సూచిస్తున్నారు.

2050 నాటికి పెరగనున్న వృద్ధ జనాభా
2050 నాటికి ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువైపోతుంది. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య, అదే సమయానికి ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల సంఖ్యతో పోలిస్తే రెండింతలు కానుంది. సగటు ఆయుర్దాయం 77.2 ఏళ్లుగా ఉంటుంది. దీనివల్ల సంక్షేమ వ్యయాల భారం పెరిగిపోతుంది. వారికోసం మరిన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది. జనాభా పెరుగుదలతో కనిపించని..గుర్తించని సవాళ్లు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది.