కరోనా కేసులు : ఫస్ట్ అమెరికా..భారత్ 10th ప్లేస్

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 03:15 AM IST
కరోనా కేసులు : ఫస్ట్ అమెరికా..భారత్ 10th ప్లేస్

ప్రపంచదేశాల కరోనా కేసుల జాబితాలో భారత్‌ 10వ స్థానానికి చేరింది. మొత్తం కేసుల్లో 10వ స్థానంలో ఉన్నా… కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మాత్రం భారత్‌ 4వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యంత ఎక్కువ కేసులు భారత్‌లోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మొన్నటివరకు ప్రతిరోజూ 5వేలకు పైగా కొత్త కేసులు రాగా… ప్రస్తుతం అది 6వేల దాటి 7వేలకు చేరువవుతోంది. 2020, మే 24వ తేదీ ఆదివారం 6వేల 767 కేసులు నమోదవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. మనదేశంలో ఇప్పటివరకు లక్షా 38వేల 474 కేసులు నమోదవగా.. 3 వేల 949 మంది మృతిచెందారు. 54వేల 440మంది రికవరీ కాగా.. ప్రస్తుతం  యాక్టివ్ కేసుల సంఖ్య 73వేల 560గా ఉంది.

ఇండియాలో మిగతా రాష్ట్రాల్లోని కేసులన్నీ ఒక ఎత్తు అయితే… ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్న కేసులు మరో ఎత్తు. అక్కడ ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలు దాటింది. ఆదివారం ఒక్క రోజే… 3వేల 41 కొత్త కేసులొచ్చాయి. 58 మంది మరణించారు. 1,196 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 50 వేల 231కి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు అక్కడ 1,635 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 33వేల 988 మంది చికిత్స పొందుతున్నారు. 

తమిళనాడు : –
తమిళనాడులో కొత్తగా 765 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించారు. మరో 833 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 16వేల 277కు చేరింది. అక్కడ ఇప్పటివరకు 111 మంది మరణించారు. ప్రస్తుతం 7వేల 839 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  మరోవైపు… చెన్నైలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నమోదైన 765 కేసుల్లో 587 కేసులు చెన్నైలోనివే. దీంతో చెన్నై వాసుల్లో ఆందోళన మరింత పెరిగింది.

గుజరాత్ : –
గుజరాత్‌లో కరోనా కేసులకు అడ్డులేకుండా పోతోంది. నిన్న కొత్తగా 394 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 14 వేల మార్కును దాటేసింది. మొత్తంగా రాష్ట్రంలో 14,063 కేసులు నమోదయ్యాయి. 858 మంది మరణించారు. అక్కడ ప్రస్తుతం 6వేల 793 యాక్టివ్‌ కేసులుండగా, అందులో 67 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. ఆదివారం 243 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 6వేల 412కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు మూడొంతులు అహ్మదాబాద్‌లోనే రికార్డవుతున్నాయి. ఆదివారం ఆ నగరంలో ఏకంగా 279 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణిస్తే 28 మంది అహ్మదాబాద్‌ వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీ : –
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భీకరంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 508 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 13వేల 418కి చేరింది. 24గంటల వ్యవధిలో అక్కడ 30 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం 273 మంది బాధితులు కోలుకోగా, మొత్తంగా 6వేల540 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 6వేల 617 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అక్కడ ఇప్పటివరకు 261 మంది మరణించారు. 

కర్ణాటక : –
కర్ణాటకలో కరోనా కేసులు 2వేలు దాటాయి. కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2వేల 89కి చేరింది. వీరిలో 654 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1391 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 42 మంది మృత్యువాత పడ్డారు.

వెస్ట్ బెంగాల్ : –
బెంగాల్‌లో కొత్తగా 200కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. నిన్న ఆ రాష్ట్రంలో 208 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. 58 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త వాటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 3,667కు పెరిగింది. ఇప్పటివరకు 1,339 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… 2,056 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 272 మంది మృత్యువాత పడ్డారు.

World’s 10 Hot Spots

1. US 1,673,806
2. Brazil 352,523.
3. Russia 344,481
4. Spain 282,370

5. UK 259,559
6. Italy 229,858
7. France 182,469
8. Germany 180,153
9. Turkey 155,686

10. INDIA Cases 138,474…Deaths : 3,949

Read: ప్రారంభమైన విమాన సర్వీసులు.. రాష్ట్రాల్లో రూల్స్ పాటించాల్సిందే..