ప్రపంచంలోనే తొలిసారి COVID-19 బ్లడ్ టెస్ట్.. 20నిమిషాల్లోనే రిజల్ట్

ప్రపంచంలోనే తొలిసారి COVID-19 బ్లడ్ టెస్ట్.. 20నిమిషాల్లోనే రిజల్ట్

ప్రపంచంలోనే ఇది తొలిసారి. COVID-19కు లాలాజలం, ముక్కులోని శ్లేష్మంతో టెస్టులు చేస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియాలో తొలిసారి బ్లడ్ శాంపుల్స్‌తో టెస్టులు చేశారు. రిజల్ట్ కూడా కేవలం 20నిమిషాల్లోనే ఫలితాలు వచ్చేశాయి. మోనాశ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ అండ్ ఏఆర్సీ సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్ రీసెర్చర్స్ ఈ టెస్టును పూర్తి చేశారు.

రీసెర్చర్స్ కథనం ప్రకారం.. ప్రస్తుతం వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందా.. గతంలో ఇన్షెక్షన్ సోకినట్లు ఏమైనా హిస్టరీ ఉందా.. అని తెలుసుకోవచ్చు. ర్యాపిడ్ కేస్ ఐడెంటిఫికేషన్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ లు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. సుదీర్ఘ కాలం కమ్యూనిటీస్ లో వైరల్ ఇన్ఫెక్షన్ ఎంతకాలం నుంచి ఉంటుందనే దానిపై క్లారిటీ కోసం ఈ టెస్టులు చేస్తున్నారు.

25మైక్రో లీటర్ల బ్లడ్ శాంపుల్స్ నోవల్ టెస్టు నిర్వహించారు. దీని ద్వారా రక్తంలో కరోనా ఎంత ఉందనేది తెలుస్తోంది. కొత్త టెస్టింగ్ పద్దతితో రీసెర్చర్స్ కొత్త విషయాలు కనుగొన్నారు. ప్రొడక్షన్ కోసం ప్రభుత్వం నుంచి సాయం కోరుతోంది టీం. రెగ్యూలర్ స్వాబ్ టెస్ట్ కంటే చాలా వేగవంతమైన పరీక్ష ఇది. ప్రతి గంటకు వందల కొద్దీ శాంపుల్స్ ను పరీక్ష చేయొచ్చు అని రీసెర్చర్స్ చెబుతున్నారు.

ఈ టెస్టు సాయంతో కరోనా వైరస్ శరీరంలో ఉందా.. లేదా తగ్గిపోయి ఎన్ని రోజులైందనేది తెలుస్తుంది. స్వాబ్(శ్లేష్మం) టెస్ట్‌తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎందుకంటే కొవిడ్ పాజిటివ్ అయితే మాత్రమే ఫలితంలో కనిపిస్తుంది లేదంటే లేదు.