ప్రపంచంలోని కరోనావైరస్ అంతా కలిపితే.. సింగిల్ కోక్ డబ్బాలో సరిగ్గా సరిపోతుందంట!

ప్రపంచంలోని కరోనావైరస్ అంతా కలిపితే.. సింగిల్ కోక్ డబ్బాలో సరిగ్గా సరిపోతుందంట!

world’s coronavirus can fit inside a single Coke can : ప్రపంచంలోని కరోనావైరస్ ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? ఆ మొత్తాన్ని ఒకదగ్గరగా చేర్చి కలిపితే.. సింగిల్ కోక్ డబ్బాలో సరిగ్గా సరిపోతుందంట.. బ్రిటన్ గణిత శాస్త్రవేత్త ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారికి కణాలన్నింటిని మొత్తం కలిపితే 160ml పరిమాణం కలిగిన కోక్ డబ్బాలో ఫిట్ అవుతుందని ఆయన అంచనా వేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బాత్ యూనివర్శిటీలో సీనియర్ లెక్చరర్ కిట్ యేట్స్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో సుమారు రెండు క్విన్టిలియన్ SARS-CoV-2 వైరస్ కణాలు ఉన్నాయని అంటున్నారు.

ఒక గ్రహం మీద ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా ఉంటుందని తేల్చేశారు. కానీ మొత్తం వాల్యూమ్‌ను లెక్కించాల్సి వచ్చినప్పుడు.. SARS-CoV-2 కణాలు చాలా చిన్నవగా ఉన్నాయని గణిత శాస్త్రవేత్త తెలిపారు. ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ లేదా ఒక టీస్పూన్ పరిమాణంలో ఉంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం భూగోళంలో వ్యాపించిన కరోనావైరస్ కణాలన్ని కలిపితే ఒక సింగిల్ డబ్బా కోక్ ఫిట్ అవుతుందని బ్రిటన్ గణిత శాస్త్రవేత్త తెలిపారు. SARS-CoV-2 కణాల వ్యాసాన్ని ఉపయోగించి అంచనా వేసినట్లు యేట్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. కోవిడ్ బాధిత సమస్యలతో 2,359,000 మందికి పైగా మరణించారని నివేదిక వెల్లడించింది.