రిప్ : కన్నమూసిన బూ

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 02:27 AM IST
రిప్ :  కన్నమూసిన బూ

ఢిల్లీ : 2011లో ప్రపంచపు అందమైన పప్పీగా గుర్తింపు పొందిన బూ కన్నుమూసింది. పన్నెండేళ్ల వయసున్న ఈ క్యూట్ డాగ్..శుక్రవారం చనిపోయినట్లు బూ ఓనర్ ఐరనీ ఆన్ ఫేస్‌బుక్‌‍లో  అనౌన్స్ చేశాడు..బూ అనే ఈ క్యూట్ పప్పీకి ఫేస్‌బుక్‌లో 16 మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. పమేరియన్ జాతికి చెందిన బూ డాగ్‌కి బడ్డీ అనే మరో కుక్కపిల్లతో ఫ్రెండ్షిప్ కుదరగా..ఈ రెండింటి ఫోటోలు నెట్‌లో తెగ వైరల్ అయ్యేవి. ఇలా బూ డాగ్ ఫోటోలతోనే దాని యజమాని 70 కోట్లకిపైగా సంపాదించారంటే దాని క్రేజ్ అర్ధం చేసుకోండి. 2011లోనే బూ..ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్‌ పేరుతో ఓ బుక్ కూడా రిలీజ్ కావడం విశేషం. బడ్డీ, బూ డాగ్స్ ఫ్రెండ్షిప్‌కి 2017లో బ్రేక్ పడింది. బడ్డీ కుక్కపిల్ల చనిపోవడంతో బూ ఒంటరితనం ఫీలవుతూ వచ్చిందట. అప్పట్నుంచి బూ కూడా దిగులు చెందుతూ..జబ్బుల బారిన పడింది. అలా ఈ ఏడాది జనవరి 18న చనిపోయినట్లు దాని ఓనర్  చెప్పాడు. బడ్డీ బూ డాగ్స్ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిన వాటి ఫాలోయర్లు వాటికి సంతాపం తెలుపుతూ రిప్ మెసేజ్‌లు పెట్టారు.