Whale Rare Video : ఆత్మహత్యకు యత్నించిన తిమింగలం … వీడియో వైరల్

ఓ తిమింగళానికి మనుషులకంటే ఎక్కువ కష్టాలు వచ్చిపడ్డాయి. జన్మనిచ్చిన ఐదు బిడ్డలు చనిపోవడం.. ఆ తర్వాత తనతో ఉన్న ఇద్దరు స్నేహితులు మృతి చెందటంతో పదేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతుంది.

Whale Rare Video : ఆత్మహత్యకు యత్నించిన తిమింగలం … వీడియో వైరల్

Dolphin Rare Video

Whale Rare Video : అందమైన తిమింగళానికి బాధతో గుండె బరువెక్కింది. దాని కష్టాలు మనుషులకంటే ఎక్కువే ఉన్నాయి. రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్ ల్యాండ్ తీరానికి సమీపంలో మెరైన్ ల్యాండ్ వారి చేతికి చిక్కి, మంది అయింది. ఇక ఈ తిమింగళానికి కిస్కా అని పేరు పెట్టి ప్రతిరోజూ ఆహారం అందించారు. పెరిగి పెద్దదై ఐదు పిల్లలకు తల్లి అయింది. అయితే పుట్టిన పిల్లలు వెంటవెంటనే చనిపోయాయి.

చదవండి : dolphin washup : విశాఖ సాగరతీరంలో మృత డాల్ఫిన్…

ఇక తనతో ఉన్న మరో రెండు తిమింగళాలు కూడా చనిపోయాయి.. దీంతో పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తుంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్య ఆత్మహత్యయత్నం చేసింది. తన తలను తానే వాటర్‌ ట్యాంకర్‌ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఏదీ ఏమైనా స్వేచ్ఛ అనేది మానవునికే కాదు.. మూగజీవాలకు కూడా ముఖ్యమే.

చదవండి : Viral Video: సముద్ర గర్భంలో ఎన్నో వింతలు.. పింక్ డాల్ఫిన్‌ని చూశారా?

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వెంటనే దానిని సముద్రంలో వదిలేయాలని కోరుతున్నారు. మూగజీవాలను ఒంటరిగా ఉంచి హింసించే హక్కు మీకెవరిచారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఒంటరిగా 10ఏళ్ళు జీవించడమంటే ఏ జివికైనా సాధారణ విషయం కాదు.