Longest Train In World: స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ రైలు.. భారత్‌లో ‘సూపర్ వాసూకీ’ గురించి తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్యాసింజర్ రైలు స్విట్జర్లాండ్‌లో శనివారం పరుగు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175ఏళ్లు అయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలో మీటర్ల పొడవు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది.

Longest Train In World: స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ రైలు.. భారత్‌లో ‘సూపర్ వాసూకీ’ గురించి తెలుసా?

Longest Train In World

Longest Train In World: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్యాసింజర్ రైలు స్విట్జర్లాండ్‌లో శనివారం పరుగు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175ఏళ్లు అయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలో మీటర్ల పొడవు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. ఈ రైలుకు 100 బోగీలు, నాలుగు ఇంజిన్లు ఉన్నాయి. 25కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టింది.

Longest Train In World

Longest Train In World

ప్రకృతి రమణీయత ఉట్టిపడే అల్ప్స్ పర్వత సానువుల గుండా సాగే ఈ మార్గంలో ప్రఖ్యాత ల్యాండ్ వాసర్ వారధి సహా 22 సొరంగాలు, 48 వంతెనలు, అనేక లోయలు, మలుపుల్లోని దృశ్యాలు ప్రయాణికులను చూపుతిప్పుకోనివ్వకుండా చేశాయి. ఈ మార్గాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రేయిషేన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫాస్కియాటి మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో సాధించిన ఇంజినీరింగ్ అద్భుతాలకు గుర్తుగా, స్విస్ రైల్వే ఏర్పడి 175 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల రైలును నడిపినట్లు తెలిపారు.

 

ఇదిలాఉంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడువైన గూడ్స్ రైలు ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీ ఐరన్ ఓర్ 7.325 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలుగా గుర్తించారు. భారత దేశంలోనూ అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఉంది. ‘సూపర్ వాసుకి’ అనే ఈ రైలు పొడవు 3.5 కిలో మీటర్లు ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన, బరువైన రైలు ఇది. ఈ రైలు నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా మధ్య 27వేల టన్నులకుపైగా బొగ్గును మోసుకెళ్తుంది. ఈ రైలుకు 295 లోడెడ్ వ్యాగన్ లతో టెస్ట్ రన్ ను నిర్వహించారు.