ప్రపంచంలోనే ముసలి పక్షి.. 70ఏళ్ల వయస్సులో జన్మనిచ్చింది

ప్రపంచంలోనే ముసలి పక్షి.. 70ఏళ్ల వయస్సులో జన్మనిచ్చింది

World’s oldest bird: ప్రపంచంలోనే ముసలి పక్షి తన 70ఏళ్ల వయస్సులో మరో ప్రాణానికి జన్మనిచ్చింది. నార్త్ ఫసిఫిక్ సముద్రం దగ్గరి ప్రాంతంలోని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ దీనిని కన్ఫామ్ చేసింది. లేసన్ ఆల్బట్రోస్సెస్ సాధారణంగా 12 నుంచి 40 సంవత్సరాలు బతుకుతాయి. వీటిని 1956లో గుర్తించారు.

ఈ పక్షి పార్టనర్ అకియాకమయ్. అది 2012వరకూ మాత్రమే బతికి ఉంది. నిజానికి ఇవి జీవితకాలం పూర్తయ్యేవరకూ పార్టనర్ తో కలుస్తూనే ఉంటాయి. ఈ ఆల్బట్రోస్సెస్ మాత్రం గతంలో, ఇప్పుడు కూడా ఇతర పార్టనర్ లతోనూ కలుస్తుంది. రీసెంట్ గా ఫిబ్రవరిలో గుడ్డు పొదిగింది ఈ పక్షి.

నవంబర్ చివరి రోజుల్లో పెట్టిన గుడ్డును పొదిగినట్లు యూఎస్ఎఫ్ డబ్ల్యూఎస్ స్టేట్మెంట్లో కన్ఫామ్ చేసింది. గుడ్డు పెట్టిన తర్వాత తన పార్టనర్ తీరప్రాంతాల నుంచి ఫీడ్ తెచ్చేది. ఇప్పుడు పొదిగిన తర్వాత రెండు పక్షలు కలిసి చిన్నారి పక్షి తిండి బాధ్యతను చూసుకుంటున్నాయి.

ఇక ఆల్బట్రోస్సెస్ తన జీవిత కాలంలో 30 నుంచి 36పిల్లలు పెట్టింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒక్క గుడ్డు మాత్రమే పెట్టగలవు ఈ పక్షులు. మిడ్ వే అటల్ నేషనల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజీలోనే ఇవి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.