World Smallest Baby : 212 గ్రాముల బరువుతో పుట్టిన శిశువు.. 13 నెలల పోరాటం తరువాత క్షేమంగా ఇంటికి!

కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టిన పసిపాప ఎట్లకేలకు ఇంటికి క్షేమంగా వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుతో పుట్టిన శిశువుగా గిన్నిస్ బుక్ గుర్తించి బిడ్డ 13 నెలల తరువాత ఇంటికి చేరుకుంది.

World Smallest Baby : 212 గ్రాముల బరువుతో పుట్టిన శిశువు.. 13 నెలల పోరాటం తరువాత క్షేమంగా ఇంటికి!

World Smallest Baby

Guinness Record Tiny Apple Baby After Long Treatment : గుమ్మడి పండులాంటి బిడ్డను కనమని పెద్దలు దీవిస్తుంటారు కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిని. అంటే బొద్దుగా..ముద్దుగా పెద్ద సైజులో ఉండే బిడ్డను కనమని అర్థం. కానీ బలహీనత వల్లో లేదా మరేదైనా కారణాలతో బిడ్డ చిన్నగా బరువు తక్కువతో పుడితే ఆ బిడ్డను కాపాడుకోవటానికి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారో..బిడ్డ తమకు ఎక్కడ దూరమైపోతుందోనని భయపడిపోతారు.తల్లడిల్లిపోతారు.అటువంటి బిడ్డలను బ్రతికించటానికి డాక్టర్లు కూడా అంతే కష్టపడతారు. కొన్ని నెలల క్రితం కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డను కాపాడటానికి డాక్టర్లు అంతే శ్రమపడ్డారు. బిడ్డకోసం తపించిపోయని ఆ తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పారు. 25 వారాలపాటు శ్రిమించిన డాక్టర్లు 212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డగా గిన్నిస్ బుక్ గుర్తించి ఆ పసిపాపను రక్షించారు. ఎట్టకేలకు ఆబిడ్డ పుట్టిన 13 నెలలకు అంటే జన్మదినం కూడా అయిపోయాక ఇంటికి క్షేమంగా చేరుకుంది తల్లిదండ్రులతో కలిసి.

సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌(NUH)లో 2020 జూన్‌ 9న నెలలు నిండకుండానే ఓ పాప 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టింది. అంటే సగటు ఆపిల్‌ పండు కన్నా తక్కువ బరువు ఉంది అంటూ ఆ పసిగుడ్డు అప్పట్లో గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ బిడ్డ బతకటం కష్టమని డాక్టర్లు కూడా చెప్పటంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండాపోయింది. తమ చిట్టితల్లి తమకు దక్కదని బోరున విలపించారు. కానీ గుండె కొట్టుకుంటున్న మా బిడ్డను ఎలాగైనా బతికించమని డాక్టర్ల కాళ్లమీద పడి వేడుకున్నారు.కానీ గ్యారంటీ అయితే చెప్పలేం కానీ మా శక్తికి మించి ప్రయత్నిస్తామని తెలిపిన డాక్టర్ల అప్పటినుంచి ఆ పసిగుడ్డుకు ఎంతగానో వైద్యం చేశారు. తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అనుమతితో రిస్క్‌ తీసుకుని మరీ ట్రీట్ మెంట్ చేశారు. అలా 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్‌మెంట్‌ ద్వారా ప్రయత్నించారు ఎన్‌హెచ్‌యూ డాక్టర్లు.

13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతమే జరిగిందని చెప్పాలి. అలా ఆ పసిగుడ్డు బరువు పెరగటానికి ఎన్నో యత్నాలు చేశారు. కేవలం 212 గ్రాముల బరువు నుంచి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు ఆ చిన్నారిని తయారు చేశారు. చక్కటి ఆరోగ్యంతో బిడ్డ తయారు కావటంతో ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు..ఇతర వైద్య సిబ్బంది తమ ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఇంత తక్కువ బరువుతో పుట్టిన బిడ్డను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామని ఇది శిశువేనా? అనే డౌట్ కూడా వచ్చిందని తెలిపారు.

ఆ బిడ్డకు వెక్‌(క్వెక్‌) యూ గ్జువాన్‌ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్‌ యూ గ్జువాన్‌ ఆ రికార్డును చెరిపేసింది. కొత్త రికార్డును క్రియేట్ చేసింది పుట్టుకతోనే.